ETV Bharat / entertainment

'నాటు నాటు' ఫుల్‌ వీడియో వచ్చేసింది.. హీరోగా మరో చైల్డ్​ ఆర్టిస్ట్​

'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు' ఫుల్‌ వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా సోమవారం విడుదల చేసింది. ఈ సంగ్​ రిలీజైన గంటలోనే 10లక్షల మంది వీక్షించడం గమనార్హం. అలాగే బాలనటుడిగా నటించిన సన్నీ పస్తా హీరోగా పరిచయమవుతున్నారు.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Apr 11, 2022, 7:43 PM IST

Updated : Apr 11, 2022, 10:52 PM IST

విడుదలైన (లిరికల్‌ సాంగ్‌) క్షణం నుంచే సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన గీతం 'నాటు నాటు'. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఈ మాస్‌ పాట విదేశీయులనూ విశేషంగా అలరించింది. సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుల్‌ వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో లిరికల్‌ వీడియోలోనే కాస్త రుచి చూసిన వారికి ‘ఇది ఫుల్‌ మీల్స్‌’ అనిపించేలా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పాటలో కథానాయిక ఒలివియా మోరిస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఇద్దరితో కలిసి కొన్ని స్టెప్పులేసి సందడి చేసింది. చంద్రబోస్‌ రచించిన ఈ గీతాన్ని రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు సమకూర్చారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.

హీరో సన్నీ..

'ఆశలపల్లకి'లో బాలనటుడిగా నటించిన సన్నీ పస్తా హీరోగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్‌ పంపాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్‌, బెక్కెం సబిత నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్​ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా దర్శకుడు వీవీ వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. డైరెక్టర్‌ బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బ్యానర్‌ స్థాపించి 16 ఏళ్లు అయిన సందర్భంగా మా బేనర్‌లో 13వ సినిమా ప్రారంభించాం.

ఇదీ చూడండి: ఆలియా, రణ్‌బీర్ పెళ్లికి ఆర్‌కే స్టూడియోస్ ముస్తాబు..! రిసెప్షన్ ఎక్కడంటే?

Last Updated : Apr 11, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.