ETV Bharat / entertainment

సల్మాన్​కు హాలీవుడ్ లేడీ మ్యారేజ్​ ప్రపోజల్​​.. షాకింగ్ రిప్లై ఇచ్చిన భాయ్​! - పెళ్లిపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌. ఏమన్నారంటే?

.
.
author img

By

Published : May 27, 2023, 3:42 PM IST

Salman Khan marriage : ఇండియన్​ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచిలర్ అంటే ఠక్కున చెప్పే పేరు సల్మాన్ ఖాన్​. ​ ఈ బాలీవుడ్ స్టార్​ హీరో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునే ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆయన పెళ్లి పీటలెక్కలేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన ఆయన.. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ఏదో ఒక సమాధానం చెబుతూ వార్తల్లో నిలూస్తునే ఉంటారు. అయితే తాజాగా ఆయన మరోసారిపెళ్లిపై స్పందించారు. షాకింగ్​ సమాధానం చెప్పారు.

IIFA Awards 2023 : అదేంటంటే.. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు(ఐఫా) - 2023 మీడియా సమావేశం దుబాయ్‌లో జరిగింది. బాలీవుడ్​ నుంచి సల్మాన్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, నోరా ఫతేహి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తదితరులు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే హాలీవుడ్​ నుంచి వచ్చిన ఓ మహిళా అభిమాని.. సల్మాన్‌ భాయ్​కు ప్రపోజ్‌ చేసింది. "సల్మాన్‌ మిమ్మల్ని చూసినప్పుడే మీతో ప్రేమలో పడిపోయా. ఈ విషయం చెప్పడానికి హాలీవుడ్‌ నుంచి ఇక్కడికి వరకు వచ్చాను" అని తన మనసులో మాటను చెప్పింది. "మీరు షారుక్‌ ఖాన్ గురించి మాట్లాడుతున్నారు కదా" అని సల్మాన్​ సరదాగా బదులిచ్చారు. అనంతరం ఆమె.."లేదు. నేను మిమ్మల్నే లవ్​ చేస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?" అని చెప్పింది. అయితే దీనిపై సల్మాన్ సమాధానమిచ్చారు. "నాకు పెళ్లి వయసు దాటేసింది. 20 ఏళ్ల క్రితమే నువ్వు నన్ను కలిసి ఉంటే చేసుకునేవాడిని" అని సరదాగా చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Salman Khan love story : కాగా, సల్మాన్‌ ఖాన్‌.. గతంలో పలువురు హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు. వారందరితో బ్రేకప్‌లు అయ్యాయి. ఐశ్వర్యారాయ్​, దీపికా పదుకొణె, కత్రితా కైఫ్​.. ఇంకా ఎందరో హీరోయిన్లు ఉన్నారు. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలోనూ ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడారు. "నా లైఫ్​లో సరైన వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నిజానికి, నా ఎక్స్​ గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరూ మంచోళ్లే. వాళ్ల వైపు నుంచి ఎలాంటి మిస్టేక్​ లేదు. తప్పంతా నాదే. నేను సంతోషంగా చూసుకోలేననే భయంతోనే వాళ్లు నన్ను వదిలి వెళ్లిపోయి ఉంటారు. వాళ్లు ఎక్కడ, ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలనే ఆశిస్తాను. నా లవ్​స్టోరీలన్నీ నాతోపాటే సమాధి అయిపోతాయి" అని అన్నారు. ఇకపోతే సల్మాన్​ రీసెంట్​గా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్​ చిత్రంతో ఆడియెన్స్​ను అలరించారు. పూజా హెగ్డే హీరోయిన్​. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఆయన టైగర్​ 3లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:

పిల్లలు కావాలి.. కానీ పెళ్లి మాత్రం వద్దు బాబోయ్​!: సల్మాన్​ ఖాన్​

మహిళల శరీరాలు విలువైనవి.. వాటిని దుస్తులతో సంరక్షిస్తేనే మంచిది : సల్మాన్​ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.