ETV Bharat / entertainment

'మా ఫ్యామిలీతో మల్టీస్టారర్​ చేయాలని ఉంది.. కానీ' - ఎఫ్​ 3 ప్రమోషన్స్​

F3 Movie Promotions Varun Tej: 'ఎఫ్ 3 సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్లీ మళ్లీ చూస్తారు' అని అంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'ఎఫ్‌ 3' శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సినిమా సంబంధించి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు వరుణ్​. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్‌ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నపై స్పందించారు.

F3 Movie Promotions Varun Tej
F3 Movie Promotions Varun Tej
author img

By

Published : May 26, 2022, 9:20 PM IST

F3 Movie Promotions Varun Tej: వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన తాజా సినిమా 'ఎఫ్‌3'. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. దిల్‌ రాజు నిర్మించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్‌ పంచుకున్న ఫన్నీ ముచ్చట్లేంటో చూద్దాం!

'గని' వచ్చిన వెంటనే 'ఎఫ్‌3' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎలా అనిపిస్తోంది?
వరుణ్‌ తేజ్‌: చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ఒక సినిమా విజయం సాధిస్తుందా? లేదా? అన్నది కేవలం ప్రేక్షకులు మాత్రమే నిర్ణయిస్తారు. 'ఎఫ్‌3' తీయాలని 'ఎఫ్‌2' షూటింగ్‌ సమయంలోనే అనుకున్నాం. దీని పూర్తి బాధ్యతను అనిల్‌ తీసుకున్నారు. ఆయన మీద మాకు నమ్మకం ఎక్కువ. ఈ సినిమా చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది.

'ఎఫ్‌3'లో మీ పాత్ర కోసం ఏమైనా సాధన చేశారా. 'ఎఫ్‌3' టీమ్‌తో నటించడం ఎలా అనిపించింది?
వరుణ్‌ తేజ్‌: కామెడీ చేయడం చాలా కష్టమని అర్థమైంది. మొదట చేయగలనా అని కంగారు పడ్డా. ఏ సన్నివేశంలో ఎలా నటించాలో అనిల్‌ దగ్గరుండి చెబుతారు. కాబట్టి అంత కష్టం ఉండదు. నాకు కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కొంచెం మొహమాటం. కానీ ‘ఎఫ్‌3’లో అందరూ అంతకు ముందు చేసిన వాళ్లే అయ్యేసరికి షూటింగ్‌ వాతావరణం అలవాటైపోయింది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బునే ప్రేమిస్తారు. ‘ఎఫ్2’ చూడని వాళ్లు ఈ సినిమా చూసినా అర్థమవుతుంది. నాకు వ్యక్తిగతంగా వెంకటేశ్‌ అంటే చాలా ఇష్టం. రెండుసార్లు ఆయనతో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే సునీల్‌ సినిమాలు చూసేవాడిని. ఆయన నాకు ఇష్టమైన కమెడియన్‌. దిల్‌రాజు నాకు చాలా క్లోజ్‌. సినిమాకు సంబంధించే కాకుండా విడిగా కూడా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం.

టిక్కెట్‌ ధర విషయంలో తీసుకున్న నిర్ణయం మీ సినిమాకు కలిసివస్తుందంటారా?
వరుణ్‌ తేజ్‌: యూత్‌ సినిమాలకు ఒక్కొక్కరే వెళతారు. కానీ ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ అంతా కలిసి వస్తారు. ఇవి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌. అలా ఫ్యామిలీ అంతా వెళ్లాలంటే కొంతమందికి భారంగా ఉంటుంది. ఈ నిర్ణయం వాళ్లకి ఉపయోగపడుతుంది.

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది?
వరుణ్‌ తేజ్‌: ప్రతి సినిమా ఇష్టమే. ఏ సినిమా అయినా దేనికదే ప్రత్యేకం. కొన్ని పాత్రలు చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని పాత్రలు చేయడం సులువుగా ఉంటుంది. ఏ సినిమా చేసినా పూర్తిగా న్యాయం చేస్తున్నానా లేదా అన్నది చూసుకుంటాను. కంచె సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఇష్టం.

హీరోలంతా పాన్‌ ఇండియా కథలవైపు వెళ్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
వరుణ్‌ తేజ్‌: కథలను ఎంచుకునే విధానం మారిందంటే అది పాన్‌ ఇండియా వల్ల కాదు. ఓటీటీల్లో ఎక్కువ కంటెంట్‌ అందుబాటులో ఉండడం వల్ల వారికి నచ్చే కథలను ఎంచుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే మంచి కథలు బయటకు వస్తాయి. నాకు వ్యక్తిగతంగా యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. అందుకని అలాంటి సినిమాలే చేయాలని అనుకోవడం లేదు. అన్ని రకాల సినిమాల్లో నటిస్తా. నాకు ముందే కథలు సిద్ధం చేసి పెట్టుకోవడం.. వరుసగా చేయడం నచ్చదు. ఒక సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల ఆదరణను బట్టి తర్వాత సినిమా ఎంచుకుంటాను. నేను పాన్‌ ఇండియా కథలు పది విన్నాను.

'ఎఫ్‌3' ట్రైలర్‌ చూసి మీ కుటుంబసభ్యులు ఎలా స్పందించారు. డబ్బు విషయంలో మీకెప్పుడైనా ఫ్రస్ట్రేషన్‌ వచ్చిందా?
వరుణ్‌ తేజ్‌: అందరూ షాక్‌ అయ్యారు. మా ఇంట్లో కూర్చోని ట్రైలర్‌ చూశాం. అందరూ నువ్వేనా చేసింది అన్నారు. షూటింగ్స్‌కి వాళ్లు రాలేదు. నా మ్యానరిజం చూసి బాగా చేశావు అన్నారు. చరణ్‌ అన్న ఫోన్‌ చేసి బాగుంది ఫన్నీగా ఉంది అన్నాడు. డబ్బు విషయంలో నేను చాలా నేర్చుకున్నా. మా నాన్న ఎంత అడిగితే అంతే ఇస్తారు. కొన్ని రంగాల్లో వాళ్లకి డబ్బు తేలికగా వస్తుంది అనుకుంటారు. కానీ కష్టపడకుండా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం ఉండదు. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి.

మెగా ఫ్యామిలీతో మల్టీస్టారర్‌ ఎప్పుడు వస్తుంది?
వరుణ్‌ తేజ్‌: చేయాలనే ఉంటుంది. కుదరాలి కదా. మేము ఇంట్లో సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోము. కేవలం కుటుంబపరమైన అంశాలే మాట్లాడుకుంటాం

ఇవీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్​​.. నాని చక్కిలిగింతలు.. 'ఉస్తాద్‌'గా శ్రీసింహా

బాలకృష్ణ మరో కొత్త అవతారం.. ఈ సారి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.