ETV Bharat / entertainment

'కోడలు వస్తుందని మీ అమ్మకు చెప్పు'.. ఇమ్మూకు వర్ష ప్రపోజల్ - వర్ష ఇమ్మాన్యుయెల్​ లవ్​స్టోరీ

Jabardasth Varsha Immanuel love story: 'జబర్దస్త్​' వర్ష​.. మరోసారి ఇమ్మాన్యుయెల్​తో తనకున్న బంధాన్ని బయటపెట్టింది. అతడంటే ఇష్టమని అందరి ముందు ప్రపోజ్ చేసింది.

Jabardasth Varsha Immanuel love story
జబర్దస్త్​ వర్ష లవ్​స్టోరీ
author img

By

Published : Jun 18, 2022, 11:52 AM IST

Updated : Jun 18, 2022, 1:14 PM IST

Jabardasth Varsha Immanuel love story: బుల్లితెర వీక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు 'జబర్దస్త్'​ షోలో ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ, లవ్​ట్రాక్​ క్రియేట్​ చేయడం మాములే. అయితే ఇందులో భాగంగా ఇమ్మాన్యుయెల్​-వర్ష జోడీకి ఓ స్పెషల్​ క్రేజ్ ఉంది. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. దానికి తోడు ఓ స్పెషల్ ఈవెంట్​లో ఈ జోడీకి పెళ్లి కూడా చేశారు. అయితే తాజాగా మరోసారి ఇమ్మూతో ఉన్న బంధం గురించి మాట్లాడింది వర్ష. తన జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే.. అది ఇమ్మాన్యుయెల్​ మాత్రమే అని చెప్పింది.

"సాధారణంగా ప్రేమించుకుంటున్న వాళ్ల మధ్య అనుమానాలు రావడం సహజమే. ఎప్పుడైనా మీ మధ్య అటువంటిది వచ్చిందా?" అని ఇంద్రజ తాజా 'ఎక్స్​ట్రా జబర్దస్త్'​ ఎపిసోడ్​లో అడిగారు.

''నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే.. అది నా ఇమ్ము మాత్రమే. ఎవరు ఏం అనుకున్నా నాకు ఎటువంటి సమస్య లేదు. వీడేంటి? ఆ అమ్మాయి ఏంటి? అదీ... ఇదీ... వీళ్ళిద్దరిదీ అలా ఇలా? అని! ఈ రోజు నేను చెబుతున్నా... ఇమ్మూ అంటే నిజంగా నాకు ఇష్టం" అని వర్ష మరోసారి తన ప్రేమను బయటపెట్టింది. ఆ తర్వాత "మీ మమ్మీకి చెప్పు.. మీ కోడలు వస్తుంది" అని చెప్పి స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయింది. దాంతో అక్కడ ఉన్నవారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అంతకుముందు ఇటీవలే ఈటీవీ భారత్​తో ముచ్చటించిన వర్ష.. ఇమ్మూ గురించి ఈ విధంగా చెప్పింది. "చెప్పాలంటే అనుకోకుండా నేను ఇమ్మాన్యుయెల్​ కలిశాం. కేవలం ఒక్క డైలాగ్​ కోసమే ఇమ్మూతో స్కిట్ చేశాను. ఆ తర్వాత మేమిద్దరం బాగా క్లోజ్​ అయ్యాం. అయితే అతడు నాకు కేవలం ఫ్రెండ్​ అని చెప్పలేను. అలా అని మా ఇద్దరి మధ్య రిలేషన్​ ఏంటనేది కూడా చెప్పలేను. అంతా బాగుంటే స్కిట్​లోనిదే బయట నిజం అవ్వవచ్చు.. ఏదైనా అవ్వొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్​ మన చేతిలో ఉండదు కదా. అతడికి నాపై చాలా గౌరవం ఉంది. నాకు కూడా అతడంటే చాలా అభిమానం." అని పేర్కొంది.

ఇదీ చూడండి: 'మా బంధం ఏంటో చెప్పను.. ఏదైనా జరగొచ్చు.. ఫేక్​ మాత్రం కాదు!'

Last Updated : Jun 18, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.