ETV Bharat / entertainment

సీక్రెట్​గా ప్రముఖ డైరెక్టర్​ నిశ్చితార్థం.. ఫొటోస్​ వైరల్​ - దర్శకుడు వెంకీ అట్లూరీ పెళ్లి

ప్రముఖ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. నేడు పూజా అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు.

Director Venky Atluri engazement
సీక్రెట్​గా ప్రముఖ డైరెక్టర్​ నిశ్చితార్థం.. ఫొటోస్​ వైరల్​
author img

By

Published : Dec 10, 2022, 3:53 PM IST

ప్రముఖ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు కాబోతున్నారు. పూజా అనే అమ్మాయితో త్వరలో ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య సీక్రెట్‌గా, నిరాండబరంగా ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రేక్షకులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ భార్య, మహానటి, సీతారామం చిత్రాల నిర్మాత స్వప్నదత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

కాగా వెంకీ అల్లూరి జ్ఞాపకం అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత స్నేహగీతం చిత్రంలో నటించడమే కాకుండా ఈ మూవీకి డైలాగ్స్‌ అందించారు. ఆ తర్వాత కేరింత, ఇట్స్‌ మై లవ్‌స్టోరీ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. ఇక వరుణ్‌ తేజ్‌-రాశిఖన్నా తొలిప్రేమ మూవీతో డైరెక్టర్‌గా మారి తొలి హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత మిస్టర్‌ మజ్ను, రంగ్‌దే చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో 'సార్‌' చిత్రాన్ని చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇదీ చూడండి: పద్మశ్రీ అవార్డ్​ గ్రహీత, ప్రముఖ సింగర్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.