ETV Bharat / entertainment

రాజమౌళిపై దర్శకుడు తేజ వైరల్ కామెంట్స్​.. - దర్శకుడు తేజ కొడుకు అరంగేట్రం

'అహింస' చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శకుడు తేజ.. రాజమౌళిపై కామెంట్స్​ చేశారు. అలానే తన కొడుకు సినీ అరంగేట్రంపై కూడా మాట్లాడారు. ఆ సంగతులు..

Director Teja about Rajamouli
రాజమౌళిపై దర్శకుడు తేజ వైరల్ కామెంట్స్​..
author img

By

Published : May 23, 2023, 8:39 PM IST

ప్రముఖ దర్శకుడు తేజ.. చాలా మంది తెలుగు సినీ ప్రియులకు ఈ పేరు తెలుసు. ఎందుకంటే ఆయన.. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' వంటి తన లవ్​ స్టోరీల చిత్రాలతో టాలీవుడ్​లో ఓ ట్రెండ్ సృష్టించారు. హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎప్పుడూ మంచి కథలతో ఆడియెన్స్​ను అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. తన చిత్రాలతో ఎంతో మంది కొత్త నటీనటులను పరిచయం చేసిన ఆయన.. ఎప్పుడూ ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు.

అయితే ఇప్పుడాయన.. నటుడు రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఆయన... తన కొడుకు అమితవ్ తేజ డెబ్యూ గురించి మాట్లాడారు.

"మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాను. విదేశాల్లో అందుకు సంబంధించిన కోర్సులు కూడా చేశాడు. హ్యాండ్స్‌మ్‌గానే ఉంటాడు కానీ.. హీరో అవ్వాలంటే అదొక్కటే సరిపోదు. అలాగే తన తొలి చిత్రాన్ని నేను డైరెక్ట్​ చేయాలా? లేదా ఇంకెవరికైనా అప్పగించాలా? అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు" అన్నారు తేజ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1000 మందికిపైగా ఛాన్స్​.. దర్శకుడు తేజ్.. తన కెరీర్ మొత్తంలో ఎంతోమంది కొత్త నటీనటులకు ఛాన్స్​ ఇచ్చారు. వారితోనే ఎక్కువగా సినిమాలు చేశారు. ఉదయ్ కిరణ్, నితిన్, రిమాసేన్, కాజల్, సదా, నవదీప్.. ఇలా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే చాలా సార్లు మాట్లాడారు. తాజాగా మరోసారి స్పందించారు. నేను ఇప్పటి వరకు 24 క్రాఫ్ట్స్​కు సంబంధించి ఇప్పటివరకు 1163 మంది పరిచయం చేశాను. "నేను ఒకరిని సెలెక్ట్​ చేసుకొని ఇంట్రడ్యూస్​ చెయ్యాలనుకుంటాను. గొప్పోడు అయినా బీదోడు అయినా.. నేను ఇంట్రడ్యూస్​ చేశాక వాళ్ళకు సినిమాలు వస్తే.. వాళ్లని పట్టించుకోను.. అదే రాలేదంటే.. మళ్ళీ సాయం చేస్తా" అని అన్నారు.

రాజమౌళిపై కామెంట్స్​.. "తేజ సినిమాలు అన్నీ ఒకేలా ఉంటాయి.. మ్యూజిక్‌ లేదా కథలు ట్రావెలింగ్‌గానీ ఒకే ప్లో కనిపిస్తుంటుంది. 'అహింస' కూడా 'జయం' తరహాలో కనిపిస్తుందని అంటున్నారు" అని యాంకర్​ అడగగా.. దీనిపై దర్శకుడు తేజ ఇంట్రెస్టింగ్​గా స్పందించారు. "నేను నాలా సినిమా తీస్తాను కాబట్టి ఒకేలా అనిపించొచ్చు. అన్ని సినిమాలను నేనే దర్శకుడిని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్‌ ఉంటాయి. కొన్ని సన్నీ వేశాలు కలుస్తుంటాయి. దగ్గరగా అనిపిస్తాయి. ఎందుకంటే వాటిని రాసింది, తీసింది నేను. అందుకే దగ్గరిపోలికలుంటాయి. నేను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్‌ సినిమాలైనా ఒకేలా అనిపిస్తాయి. రాజమౌళి సినిమాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఆయన తీసినవన్నీ.. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నీ ఒకే ప్యాట్రన్‌లో ఉంటాయి. రాజమౌళి మాత్రమే కాదు.. మహేంద్రన్‌, గౌతమ్‌ మేనన్‌ సినిమాలు కూడా అలానే ఉంటాయి." అని అన్నారు తేజ.

ఇదీ చూడండి: ప్రియాంక చోప్రా 'నెక్లెస్'​ రూ.204 కోట్లు.. ఊర్వశి రౌతేలాది రూ.274 కోట్లు.. సామ్​ది ఎంతో గుర్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.