ETV Bharat / entertainment

పుష్ప-2లో సుకుమార్​కు నో రెమ్యునరేషన్!.. బన్నీకి రూ.125 కోట్లు?

author img

By

Published : Oct 5, 2022, 10:11 PM IST

Updated : Oct 5, 2022, 10:34 PM IST

Pushpa 2 Movie : 'పుష్ప' దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ 'పుష్ప-2'కు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. ఎందుకంటే..

director sukumar
director sukumar

Pushpa 2 Movie : పుష్ప-అల్లుఅర్జున్-సుకుమార్​.. ఈ పేర్లు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతున్నాయి. ఒక్క సినిమాతోనే పాన్​ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్​, దర్శకుడు సుకుమార్​. దీంతో రెండో పార్ట్​పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆ సినిమా దర్శకుడు సుకుమార్​పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సుకుమార్​ 'పుష్ప-2' సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా పని చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప సినిమా భారీ విజయం సాధించడం వల్ల ఈ స్టార్​ డైరెక్టర్​ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడట. సాధారణంగా రూ.15 కోట్లు తీసుకునే సుక్కు.. ప్రస్తుతం రూ.60 కోట్లకు పెంచేశాడని సినీవర్గాలు అంటున్నాయి. అయితే 'పుష్ప-2' చిత్రానికి మాత్రం ఆయన రెమ్యునరేషన్​ తీసుకోవడం లేదు. తను కొత్తగా స్టార్ట్ చేసిన సుకుమార్‌ రైటింగ్స్‌.. ఈ సినిమాకు కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో సినిమాకు రెమ్యునరేషన్‌ తీసుకోకుండా లాభాల్లో వాటాకు సుకుమార్‌ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

అయితే ఇదేమీ తక్కువ మొత్తం కాదని విశ్లేషకులు అంటున్నారు. అలా లాభాల్లో షేర్​ చూసినా.. సుకుమార్​ కనీసం రూ.70 కోట్ల వరకు వెనకేసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే అల్లు అర్జున్ కూడా పార్ట్​-2 కోసం రూ.125 కోట్ల వరకు రెమ్యనరేషన్ తీసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. 'పుష్ప' సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం వల్ల.. 'పుష్ప-2'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

'బాహుబలి-2', 'కేజీఎఫ్‌-2' కోసం ఎంతలా ఎదురుచూశారో 'పుష్ప-2'కు కూడా అదే రేంజ్‌లో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా థియేట్రికల్​ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్​కు భారీ మొత్తం వచ్చే అవకాశం ఉంది. అయితే పూజా కార్చక్రమాలు అయిపోయినప్పటికీ పుష్ప-2 షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దసరా తర్వాత షూటింగ్ స్టార్ట్​ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: నటి శ్రీలీల తల్లిపై పోలీస్ కేసు నమోదు.. ఫిర్యాదు చేసింది ఆయనే

చిరంజీవి ఫ్యామిలీతో 'గొడవల'పై అల్లు అరవింద్​ క్లారిటీ!

Last Updated : Oct 5, 2022, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.