Director Krishna vamsi 300 crore budget film: ప్రయోగాత్మక, కుటుంబకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే దర్శకుడు కృష్ణవంశీ. ప్రస్తుతం 'రంగమార్తాండ' సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్లతో ప్రాజెక్ట్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓటీటీ ఎంట్రీపై ఆయన స్పందించారు.
"ఓటీటీ కోసం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నా. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తా. ఇప్పుడే దాని గురించి చెప్పను కానీ తప్పకుండా అది పెద్ద ప్లాన్ అవుతుంది. రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకూ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ సిద్ధమయ్యే అవకాశం ఉంది. మనం ఏది అనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉంటుంది. నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఉండదు" అని కృష్ణవంశీ వివరించారు.
కృష్ణవంశీ ప్రస్తుతం 'రంగమార్తాండ' చేస్తున్నారు. మరాఠీలో సూపర్‌హిట్ అందుకున్న 'నట్‌సామ్రాట్'కు ఇది రీమేక్. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ప్రస్తుతం ఉన్న రోజుల్లో తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా చూస్తున్నారు? వంటి భావోద్వేగభరితమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రెడిషనల్‌గా అనసూయ, రష్మి, శ్రీముఖి.. చూస్తే రెండు కళ్లు చాలవ్!