ETV Bharat / entertainment

Devara VFX : 'దేవర' షాకింగ్​ న్యూస్​.. రూ.100కోట్ల బడ్జెట్​తో వీఎఫ్​ఎక్స్​ షురూ.. - ఎన్టీఆర్ దేవర

Devara VFX : దర్శకుడు కొర‌టాల శివ‌-యంగ్ టైగర్​ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా 'దేవర' నుంచి అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు..

Devara VFX
Devara VFX : 'దేవర' షాకింగ్​ న్యూస్​.. రూ.100కోట్ల బడ్జెట్​తో వీఎఫ్​ఎక్స్​ షురూ..
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 8:22 PM IST

Devara VFX : దర్శకుడు కొర‌టాల శివ‌-యంగ్ టైగర్​ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా 'దేవర'. పక్కా పవర్​ఫుల్​ యాక్షన్ ప్యాక్డ్​ ఎంటర్​టైనర్​గా చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా తెరకెక్కిస్తున్నారు. సీ(సముద్రతీరం) కాన్సెప్ట్​తో రానున్న ఈ సినిమాలో వీఎఫ్​ఎక్స్​ పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్, కొరియోగ్రాఫర్స్​​ కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

ఈ చిత్రంలో థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు అంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్​లో పలు భారీ సీ సెట్స్​ నిర్మించి.. పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. అప్పుడప్పుడు వీటికి సంబంధించిన అప్డేట్స్​ను కూడా మూవీటీమ్ ఇస్తూనే ఉంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా వీఎఫెఎక్స్ వర్క్ ప్రారంభమైందని సమాచారం అందింది. సినిమాలో ఇప్పటి వరకు షూట్ చేసిన యాక్షన్ సీన్స్​ను వీఎఫెఎక్స్​ ఎక్స్​పర్ట్స్​ టీమ్స్​కు పంపినట్లు తెలిసింది.

ఇకపోతే ఈ చిత్రాన్ని దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో రూ.80 నుంచి రూ.100కోట్ల వరకు కేవలం వీఎఫెఎక్స్ వర్క్ కోసమే భారీగా ఖర్చు చేయనున్నారని అంటున్నారు. దీని ఆధారంగా సినిమా ఏ రేంజ్​లో ఉండబోతుందోనని అభిమానులు అంచనాలను పెంచేసుకుంటున్నారు.

Devara Movie Release Date : ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్‌-యువసుధ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆదిపురుష్ ఫేమ్​ 'రావ‌ణ్‌' సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్​ హిట్ తర్వాత కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో ఇది రానుండటం మరో విశేషం. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఆర్‌.రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహిరస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న సినిమా గ్రాండ్​గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆల్​ ఫస్ట్​ లుక్​ పోస్టర్​ కూడా ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది.

April 2024 Tollywood Movies : 'దేవర'కు గట్టి పోటీ.. ఏప్రిల్​లో క్యూ కట్టనున్న సినిమాలు ఇవే..

Jr NTR Devara : పులితో గేమ్ కంప్లీట్.. ఇప్పుడు సొర చేపతో 'దేవర' ఢీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.