ETV Bharat / entertainment

Devara Saif Ali Khan Look : 'దేవర'లో వైలంట్​గా 'భైర'.. సైఫ్​ లుక్​ చూశారా? - దేవర మూవీ లేటెస్ట్ అప్డేట్​

Devara Saif Ali Khan Look : జూనియర్​ ఎన్​టీఆర్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న​ 'దేవర' నుంచి ఓ సాలిడ్​ అప్డేట్​ను ఇచ్చింది మూవీ టీమ్​. బాలీవుడ్ నటుడు సైఫ్​ అలీ ఖాన్​ బర్త్​డే సందర్భంగా సినిమాలో ఆయన లుక్​కు సంబంధించిన పోస్టర్​ను ఒకటి విడుదల చేసింది.

devara saif ali khan look
దేవర సైఫ్​ అలీ ఖాన్ లుక్​​
author img

By

Published : Aug 16, 2023, 2:11 PM IST

Updated : Aug 16, 2023, 2:42 PM IST

Devara Saif Ali Khan Look : జూనియర్​ ఎన్​టీఆర్​ 'దేవర' నుంచి ఓ సాలిడ్​ అప్డేట్​ను ఇచ్చింది మూవీ టీమ్​. బాలీవుడ్ నటుడు సైఫ్​ అలీ ఖాన్​ బర్త్​డే సందర్భంగా సినిమాలో ఆయన లుక్​కు సంబంధించిన పోస్టర్​ను ఒకటి విడుదల చేసింది. ఇందులో ఆయమ భైరా అనే క్యారెక్టర్​లో నటిస్తున్నట్లు ఆ పోస్టర్​ ద్వారా తెలిపింది. ఈ పోస్టర్​లో సైఫ్ అలీ ఖాన్ లుక్ చూస్టుంటే.. జుట్టు ముఖం మీద పడుతూ బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్‌తో ఆయన కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలు, కింద సముద్రం, అందులో పడవల్లో వెళ్తున్న కొంతమందిని చూపించారు. గతంలో విడుదలన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌లోనూ పడవల్లో ఉన్న కొంతమందిని చంపినట్లు చూపించారు. కాబట్టి ఆ గ్యాంగ్.. సైఫ్ అలీ ఖాన్​కు సంబంధించిన మనుషులే అని తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే జూనియర్​ ఎన్​టీఆర్​, జాన్వీ కపూర్ పోస్టర్లను రిలీజ్​ చేసిన మూవీ టీమ్​.. ఇప్పుడు సైఫ్​ పోస్టర్​తో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అయితే 'ఆర్ఆర్​ఆర్'​ తర్వాత జూనియర్​ ఎన్​టీఆర్​ నటిస్తున్న సినిమా అయినందున 'దేవ‌ర‌' గురించి ఎటువంటి అప్డేట్​ వచ్చినా అది ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజౌతుందా అంటూ ఫ్యాన్స్​ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Devara Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్​టీఆర్​ సరసన బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్‌ చాకో లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ‌సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం దేవర సినిమా శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. తారక్​ సైతం ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల మందుకు తెచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ సినిమా ఫుల్ టైమ్​ మాస్ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ చెప్పిన విషయం తెలిసిందే. సముద్రపు భూభాగాల్లో జరిగే కథ అని, ఇందులో మాస్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరగ్గా అందులో అన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం.

April 2024 Tollywood Movies : 'దేవర'కు గట్టి పోటీ.. ఏప్రిల్​లో క్యూ కట్టనున్న సినిమాలు ఇవే..

Jr NTR Devara : పులితో గేమ్ కంప్లీట్.. ఇప్పుడు సొర చేపతో 'దేవర' ఢీ!

Last Updated : Aug 16, 2023, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.