ETV Bharat / entertainment

షారుక్​ ఖాన్​కు ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి - అలియా భట్​ మూవీస్​

బాలీవుడ్​లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న డార్లింగ్స్​ను తెలుగు భాషలో రీమేక్​ చేయనునన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షారుక్​ ఖాన్ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ విషయాన్ని విజయ్‌ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి.

vijay sethupathi new movie
vijay sethupathi new movie
author img

By

Published : Aug 14, 2022, 7:04 AM IST

అలియా భట్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం 'డార్లింగ్స్‌'. విజయ్‌ వర్మ, షెఫాలీ షా కీలక పాత్రలు పోషించారు. జస్మీత్‌ రీన్‌ దర్శకురాలు. షారూక్‌ఖాన్‌ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థతో కలిసి అలియా సొంతంగా నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమాలో అలియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ కామెడీ డ్రామాని తెలుగు, తమిళ భాషల్లో పునర్మించనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. 'చిత్రానికి మంచి విజయం దక్కింది. దీన్ని హిందీకే పరిమితం చేయదలచుకోలేదు. ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. మందుగా తెలుగు, తమిళ నేటివిటీకి అనుగుణంగా కొద్దిమార్పులు చేసి ఆ భాషల్లో రీమేక్‌ చేయాలనుకుంటున్నాం' అంటూ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఓఓ గౌరవ్‌ వర్మ ఓ మీడియాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

.

లాయర్‌గా అక్షయ్‌కుమార్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ మరోసారి నల్ల కోటుతో మెప్పించనున్నారు. తను లాయరు పాత్రలో నటించనున్న 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3' 2023లో పట్టాలెక్కనుందని శనివారం సినీవర్గాలు ప్రకటించాయి. దీన్ని స్టార్‌ స్టూడియోస్‌ నిర్మిస్తుండగా.. సుభాష్‌కపూర్‌ తెరకెక్కించనున్నారు. 'జాలీ ఎల్‌ఎల్‌బీ' వరుసలో ఇది మూడో ఫ్రాంచైజీ చిత్రం. 'కోర్టు రూం ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా మొదటి రెండు భాగాలకు మించి నవ్వులు పంచుతుంది. ఇప్పటికే స్క్రిప్టువర్క్‌ పూర్తైంది. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ మొదలవుతుంది. నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నాం. త్వరలోనే నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తాం' అని చిత్రవర్గాలు తెలిపాయి. మరోవైపు అక్షయ్‌కుమార్‌ 'కట్‌పుత్లీ', 'రామ్‌సేతూ', 'సెల్ఫీ', 'ఓ మై గాడ్‌ 2', 'క్యాప్సూల్‌ గిల్‌', 'బడే మియా ఛోటేమియా' ప్రాజెక్టుల చిత్రీకరణలో భాగంగా తీరిక లేకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.

.

కరణ్‌జోహార్‌ చిత్రంలో సారా: దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌, సైఫ్‌ అలీఖాన్‌ తనయ సారా అలీఖాన్‌ కాంబినేషన్‌లో రెండు చిత్రాలు పట్టాలెక్కనున్నాయి. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్‌జోహార్‌ ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు. 'మా ధర్మా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఒక చిత్రంలో సారా నటించనుంది. ఇది పూర్తైన తర్వాత తను మాతోపాటు మరో సినిమా చేస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులపై మేం చాలా ఉత్సుకతగా ఉన్నాం. త్వరలోనే మొదటి చిత్రం పట్టాలెక్కనుంది' అని పేర్కొన్నారు. సారా ప్రస్తుతం 1942 క్విట్‌ ఇండియా ఉద్యమం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో బిజీగా ఉంది. దీనికి కన్నన్‌ అయ్యర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదికాకుండా ఉతేకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రంలో విక్కీ కౌశల్‌తో ఆడిపాడుతోంది.

.

షారుక్‌తో సేతుపతి పోరు: షారుక్‌ ఖాన్‌ - అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం 'జవాన్‌'. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం వినిపిస్తోంది. ఇప్పుడీ విషయాన్ని విజయ్‌ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. షారుక్‌ - అట్లీల చిత్రంలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం వాస్తవమేనని.. ఇది కాకుండా ఆయన మరే ఇతర తెలుగు ప్రాజెక్ట్‌లలోనూ విలన్‌గా నటించట్లేదని సామాజిక మాధ్యమాల ద్వారా స్పష్టం చేశారు. ఈ చిత్రం కోసం ఆయన త్వరలో సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలిసింది. ఇదొక భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 2న విడుదల కానుంది.

ఇవీ చదవండి: వాణీకపూర్​ బ్లాక్​ అండ్​ వైట్​ గ్లామర్​ ట్రీట్​ కుర్రకారు ఫిదా

ఫ్యాన్స్​కు అందుబాటులో స్టార్​ హీరో నిజంగా వచ్చానంటూ వీడియో రిలీజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.