ETV Bharat / entertainment

Sekhar Master: ఒక్క పూట తిండి దొరక్క.. దొంగచాటుగా ఫంక్షన్స్​కు వెళ్లి.. - Choreographer Sekhar Master Emo

Choreographer Sekhar Master: వెండితెరపై మాస్‌.. క్లాస్‌.. మాంటేజ్‌.. ఇలా డ్యాన్స్‌ థీమ్‌ ఏదైనా తనదైన స్టైల్​లో కొత్త స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు డ్యాన్స్​మాస్టర్​ శేఖర్‌ మాస్టర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కెరీర్​కు సంబంధించిన పలు విషయాలు, ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, డ్యాన్స్​మాస్టర్​గా తాను ఎదిగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సంగతులివీ..

Choreographer Sekhar Master emtional
శేఖర్ మాస్టర్ కష్టాలు
author img

By

Published : Aug 10, 2022, 10:30 AM IST

Choreographer Sekhar Master: డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. ఇదే ఆశగా.. శ్వాసగా సాగిపోతుంటారాయన. తాను చేసే ప్రతి పాటలోనూ ఏదో కొత్తదనం ఉండాలని పరితపిస్తుంటారు. 'జబర్దస్త్‌'కు వెళ్తే, కంటెస్టెంట్‌లతో కలిసిపోయి 'శేకు'గా నవ్వులు పంచుతారు. అటు అగ్ర హీరోలతో ఇటు యువ హీరోలతోనూ తనదైన శైలిలో స్టెప్‌లు వేయించి వెండితెరను 'షేక్‌' చేసేస్తుంటారు. 'ఢీ'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన కెరీర్‌లో ఎన్నో గెలుపోటములను చవి చూశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లైఫ్​లో పడ్డ ఆర్థిక కష్టాలు, కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు.

మొదట్లో రాకేష్ మాస్టర్ దగ్గర పనిచేసినట్లు, అయితే కొద్దికాలమే అన్నారు. అప్పట్లో ఆయన డ్యాన్స్​ స్ట్లైల్​గా ఉంటుందని చెప్పారు."నేను ఆయన దగ్గర ఉన్న సమయంలో ఆయనకు అంతగా షూటింగ్స్​ ఉండేవి కావు. అప్పుడు అయన కేవలం క్లాస్​లు చెప్పేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకు మంచి ఛాన్స్​లు వచ్చాయి" అని అన్నారు. తన డ్యాన్స్​ను సీనియర్​ కొరియోగ్రాఫర్​, నటుడు లారెన్స్ ప్రశంసించారని.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న సాంగ్స్ ఎక్కువగా చేశానని చెప్పారు. తాను మాస్టర్​ అయ్యాక పోస్ట్​ బాక్స్ సినిమాకు మొదటిసారి కొరియోగ్రాఫర్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి ఎన్నో సమస్యలు ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.

సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి వెనుక ఓ కథ ఉంటుందని చెబుతూ.. తాను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపాడు. "అప్పట్లో ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. కానీ.. అలా ఎంతకాలం తెచ్చుకుంటాము. అలాగే దొంగచాటుగా ఫంక్షన్​ హాల్స్​కు వెళ్లి తినేవాళ్ళం. మొదట్లో రెండు మూడు సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్​గా వెళ్లాను. అప్పుడు 75 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాను. రోజుకు ఒకపూట తిండి దొరికినా చాలు అనుకునే సమయంలో 75 రూపాయలు దొరకడం అదృష్టంగా భావించా. నా మొదటి జీతం అదే. చాలా సంతోషమేసింది" అని కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఇదీ చూడండి: Tollywood: రీసెంట్​ బెస్ట్ ఆన్​స్క్రీన్​ పెయిర్స్​.. వీళ్ల లవ్​ట్రాక్​కు ఆడియెన్స్​ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.