Dance choreographer Rakesh master died : చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్(53) కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయనకు రక్త విరోచనాలు అయ్యాయి. దీంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు రాకేశ్ మాస్టర్ ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. అలా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన మరణవార్త విని చాలా మంది షాక్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Rakesh master choreography movies in telugu : రాకేశ్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1968లో తిరుపతిలో జన్మించారాయన. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఈయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేశ్. ఈ క్రమంలోనే బుల్లితెరపై 'ఆట' డ్యాన్స్ షోతో డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా ఎన్నో విజయవంతమైన పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. 'లాహిరి లాహిరి లాహిరిలో', 'చిరునవ్వుతో', 'దేవదాసు', 'అమ్మో పోలీసోళ్లు', 'సీతయ్య' సహా పలు సూపర్ హిట్ సినిమాలకు రాకేశ్ కొరియోగ్రఫీ చేశారు.
అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తరచూ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. అలా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. తన కెరీర్‌ను కొంతమంది కలిసి నాశనం చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయ్యారు. అలానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ టాక్ ఆఫ్ ది సోషల్‌మీడియాగా నిలిచేవారు. దీంతో ఆయన మతిస్థిమితం కోల్పోయారని కూడా చాలా మంది విమర్శించారు. ఇకపోతే ఆయన ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్'షోలోనూ ఆయన పలు ఎపిసోడ్స్‌లో నటించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కాగా, ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ సహా మరికొందరు ఆయన శిష్యులే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాకేశ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన కొన్ని సాంగ్స్ (Rakesh master songs)
- వెండితెరకు మా వందనాలు (మనసిచ్చాను)
- చందమామ కన్నా చల్లని వాడే (యువరాజు)
- ఎక్స్టసీ ప్రైవసీ (సీతారామరాజు)
- నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ (గర్ల్ ఫ్రెండ్)
- సొమ్ములే ఆదా చేయరా (బడ్జెట్ పద్మనాభం)
- నిన్నలా మొన్నలా లేదురా (చిరునవ్వుతో)
- నేస్తామా ఓ ప్రియ నేస్తమా, కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేకున్నా (లాహిరి లాహిరి లాహిరిలో)
- బంగారం.. బంగారం, ఏయ్ బాబూ ఏంటి సంగతి, నువ్వంటేనే ఇష్టం, నిజంగా చెప్పాలంటే క్షమించు (దేవదాసు)
ఇదీ చూడండి :
రాకేశ్ మాస్టర్, నరేశ్ ఫన్నీ డ్యాన్స్
ఎవరికీ ఆ సామర్థ్యం లేదు.. అది అబద్ధం..! : 'ఆదిపురుష్' ఔం రౌత్