ETV Bharat / entertainment

ఆలియా భట్ టు విజయ్ దేవరకొండ- ఇండియన్ యాక్టర్ల సొంత ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే! - విజయ్ బ్రాండింగ్ క్లాత్

Clothing Brands By Celebrities : ఆలియా భట్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ నటులుగా అందరికీ తెలుసు. కానీ వారికి సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉందని ఎంత మందికి తెలుసు? వీరే కాదు ఇతర భారతీయ నటులకు వారి సొంత క్లాత్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం.

Clothing Brands By Celebrities
Clothing Brands By Celebrities
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 10:27 AM IST

Clothing Brands By Celebrities : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మన భారతీయ నటులు అక్షరాలా పాటిస్తున్నారు. ఒకవైపు నటులుగా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరోవైపు సొంతంగా పలు వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కొందరు జిమ్​లు, రెస్టారెంట్లు ఓపెన్ చేస్తే మరికొందరు సొంత క్లాత్ బ్రాండ్స్ ప్రారంభిస్తున్నారు. అలా ఇప్పటి వరకు సొంతంగా బట్టల బ్రాండ్స్ ఉన్న ఇండియన్ యాక్టర్స్ ఎవరు? వారి బ్రాండ్స్ ఏంటి?

బిజినెస్​లోనూ ఆలియా సూపర్​!
Alia Bhatt Clothing Brand : బాలీవుడ్ నటి, నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత ఆలియా భట్ 2020లో సొంత క్లాత్ బ్రాండ్ ఓపెన్ చేసింది. దీని పేరు ఈద్-ఏ-మమ్మ. ఇందులో చిన్న పిల్లల వస్త్రాలు తయారు చేస్తారు. దీన్ని ప్రారంభించిన 10 నెలల్లోనే పది రెట్లు పెరిగి భారీ లాభాల్ని ఆర్జించింది. దీని విలువ దాదాపు రూ.150 కోట్లు.

బియింగ్ హ్యూమన్ సల్మాన్​!
Salman Khan Clothing Brand : బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్​కు సైతం సొంత బట్టల బ్రాండ్ ఉంది. దాని పేరు బీయింగ్ హ్యూమన్. పేదలకు మంచి విద్య, వైద్యం అందించడానికి ఆయన ఓ ట్రస్ట్​ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇదే పేరుతోనూ బట్టల బ్రాండ్ ప్రారంభించారు. ఇందులో వచ్చే డబ్బులతో పేదలకు విద్య, వైద్యం అందిస్తారు. పలు కార్యక్రమాల్లో సల్మాన్ ఈ పేరుతో ఉన్న టీషర్టు ధరిస్తూ ఉంటారు.

రౌడీ బ్రాండ్​తో దేవరకొండ!
Vijay Devarakonda Clothing Brand Name : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండకు సొంత ఫ్యాషన్ బ్రాండ్ ఉందని చాలా మందికి తెలుసు. దాని పేరు రౌడీ. ఆ దుస్తులకు యూత్​లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది వీటిని వాడుతున్నారు. ఆయన కూడా పలు సినిమా ప్రమోషన్లు, ఇతర సమయాల్లోనూ వాటి గురించి ప్రచారం చేస్తుంటారు.

సామ్ కూడా బిజినెస్ ఉమెన్​!
Samantha Clothing Brand : టాలీవుడ్ హీరోయిన్ సమంతకు కూడా సాకి అనే పేరుతో సొంత ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. దీన్ని ఆమె 2020 సెప్టెంబరులో ప్రారంభించింది. ఇందులో ట్రెడిషనల్ సహా అన్ని రకాల దుస్తులుంటాయి. పిల్లల కోసం కిడ్స్ వేర్ కూడా ఉంది. ఆన్​లైన్​లో కొనుగోలు చేసుకోవచ్చు. తను కళాశాలలో చదువుకునే సమయంలో డిజైనర్ వేర్ వేసుకోవాలనే కోరిక ఉండేదని, కానీ వాటిని కొనేందుకు స్థోమత లేదని, ఎప్పటికైనా ఒక సొంత క్లాత్ బ్రాండ్ పెట్టాలనే కోరికతోనే దీన్ని ప్రారంభించినట్లు సమంత తెలిపింది.

సైఫ్ అలీ ఖాన్ బ్రాండ్ ఇదే!
Saif Ali Khan Clothing Brand : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ సైతం సొంత క్లాత్ బ్రాండ్ కలిగి ఉన్నారు. దాని పేరు హైజ్ ఆఫ్ పటౌడీ. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మింత్రతో కొలాబరేషన్ అయి సైఫ్ దీన్ని ప్రారంభించారు. 2018 లో దీన్ని ఓపెన్ చేశారు. ఇందులో ఎత్నిక్ వేర్ స్పెషల్.

సోనమ్ కపూర్ బ్రాండ్ నేమ్​ అదే
Sonam Kapoor Clothing Brand : రిసన్ (Rheson) పేరుతో సోనమ్ కపూర్, రియా కపూర్​లు సొంత ఫ్యాషన్ బ్రాండ్​ను 2015లోనే స్టార్ట్ చేశారు. సినిమాల్లోకి రాకముందు సోనమ్​కు చాలా బ్రాండ్స్ నుంచి అంబాసిడర్ ఆఫర్లు వచ్చాయి. ఆమెను సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతారు. అలాంటి వారందరికీ తక్కువ ధరలో, ఫ్యాషన్​గా కనిపించేందుకు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండానే మంచి వస్త్రాలు అందించేందుకు దీన్ని ప్రారంభించామని చెప్పింది.

హృతిక్ రోషన్ ఓన్ ఫ్యాషన్ బ్రాండ్
Hrithik Roshan Clothing Brand : హృతిక్ రోషన్ అనగానే మనకు ఫిట్​నెస్​తో పాటు ఫ్యాషన్ దుస్తులు కూడా గుర్తొస్తాయి. అలాంటి హృతిక్.. HRX పేరుతో సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్ స్టార్ట్ చేశాడు. ఈ బ్రాండ్ బట్టలు మనకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఏ జియో, మింత్రలో కూడా దొరుకుతాయి. ఎక్కువగా జిమ్, స్పోర్ట్స్ సంబంధిత వస్త్రాలు తయారు చేస్తారు. వీరే కాకుండా కరీనా కపూర్, దీపికా పదుకొణె, బిపాసా బసు, శిల్పా శెట్టి, మలైకా అరోరా, షాహిద్ కపూర్ లాంటి వారికి కూడా సొంత ఫ్యాషన్ బ్రాండ్లు ఉన్నాయి.ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.