ETV Bharat / entertainment

మా కుటుంబం అలా కావాలనేదే నా కోరిక: చిరు - hindi industry

Mega Family Chiranjeevi: మెగా కుటుంబాన్ని దక్షిణాది కపూర్ ఫ్యామిలీ అని అందరితో అనిపించుకోవాలన్నదే తన కోరిక అని అన్నారు మెగాస్టార్​ చిరంజీవి. ఆచార్య సినిమా ప్రమోషన్స్​లో భాగంగా తన కుటుంబంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ
author img

By

Published : Apr 26, 2022, 10:03 PM IST

Mega Family Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో సోలోగా ప్రవేశించిన చిరంజీవి కొణిదెల కొద్ది సంవత్సరాల్లోనే వటవృక్షంలా ఎదిగారు. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ ప్రియులకు చేరువయ్యారు. ఎంతో మంది తోటినటులను ప్రోత్సహించారు. తెలుగు సినిమా పరిశ్రమను సొంత కుటుంబంలా భావించారు. అలాగే తమ కుటుంబం నుంచి డజను మంది సినిమా పరిశ్రమలో భాగమయ్యేలా చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ పాపులారిటీని పెంచుకొంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబం గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. బాలీవుడ్ కపూర్ ఫ్యామిలీతో మెగా కుటుంబాన్ని పోల్చారు.

మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ

"బాలీవుడ్​లో కపూర్ కుటుంబానికి గొప్ప క్రేజ్ ఉంది. హిందీ సినిమా అంటే కపూర్ ఫ్యామిలీ.. కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ పరిశ్రమ. కాబట్టి బాలీవుడ్​లో కపూర్ ఫ్యామిలీకి ఉండే గౌరవం మెగా కుటుంబానికి కూడా ఉండాలనేది నా కోరిక. తమ ఫ్యామిలీని దక్షిణాది కపూర్ ఫ్యామిలీ అని అనిపించుకోవాలన్నదే నా ఆశ. మా కుటుంబం నుంచి పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్​చరణ్ గొప్పగా రాణించడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా రంగంలో వారికంటూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నారు"

-మెగాస్టార్​ చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి తన కెరీర్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29న రిలీజవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే 'గాడ్ ఫాదర్', 'భోళాశంకర్'తో పాటు మరో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు. యువ దర్శకులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు చిరు.

మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ

ఇవీ చదవండి:

చరణ్​తో పోటీ.. 'రేసుగుర్రం'లో శ్రుతిలా ఫీలయ్యా: చిరు

చిరు తొలిసారి 'నక్సలైట్​'గా చేసిన సినిమా ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.