ETV Bharat / entertainment

చిరు వర్సెస్​ బాలయ్య.. మరోసారి బాక్సాఫీస్ వార్​కు రెడీ! - చిరంజీవి వర్సెస్​ బాలకృష్ణ

Chiranjeevi Vs Balakrishna: మెగాస్టార్​ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్​ వద్ద పోటీ పడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Chiranjeevi VS Balakrishna
చిరు వర్సెస్​ బాలయ్య
author img

By

Published : Jul 28, 2022, 1:45 PM IST

Chiranjeevi Vs Balakrishna: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. ఈ రెండు పేర్లకు ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవతరం కథానాయకులు వస్తున్నా వారికి పోటీగా నిలుస్తూ ఇంకా టాలీవుడ్​ను ఏలుతున్నారు. వీరిద్దరి సినిమా రిలీజ్​ అవుతుంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇప్పటికే వీరిద్దరూ చాలా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150', బాలయ్య నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలు కూడా ఒకరోజు వ్యవధిలో రిలీజ్ అయి పోటీ పడ్డాయి. అయితే ఈ ఇద్దరు స్టార్స్​ మరోసారి పోటీ పడటానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా 'మెగా154'. 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్​ను ఖరారు చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్​ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. మాస్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. ఇందులో చిరు ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే మూవీటీమ్​ తెలిపింది.

అయితే ఇప్పుడదే రోజు వచ్చేందుకు నటసింహం కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది. 'అఖండ' విజయంతో సెన్షేషన్​ క్రియేట్​ చేసిన ఆయన.. అదే జోరులో గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో 'ఎన్​బీకే 107' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే ఇది దసరాకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడది రూటు మార్చిందని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. బాక్సాఫీస్​ వద్ద మరోసారి చిరంజీవి-బాలయ్య పోటీపడటం ఖాయం. అలానే అదే సమయంలో ఓ సందడి వాతావరణ క్రియేట్ అవ్వడం, టాలీవుడ్ మరింత కళకళలాడుతుందని చెప్పొచ్చు. మరో విశేషమేమిటంటే ఈ రెండు చిత్రాలన్నీ మైత్రి మూవీ మేకర్స్​ నిర్మించడం.. రెండింటిలోనూ శ్రుతిహాసనే హీరోయిన్​గా నటించడం. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా, 'ఎన్​బీకే 107'లో కన్నడ స్టార్​ దునియా విజయ్​కుమార్​ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్​కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: "ఇంద్ర సినిమా వల్లే అది సాధ్యమైంది.. లేదంటే..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.