ETV Bharat / entertainment

ఆ రికార్డ్​ సాధించిన తొలి తెలుగు చిత్రం చిరంజీవిదే.. మెగాస్టార్​ కెరీర్​కు బిగ్ టర్నింగ్ పాయింట్​!

2003 సెప్టెంబరు 24న థియేటర్లలో విడుదలైన ఓ ఈ సినిమా.. చిరు అభిమానులనే కాకుండా సగటు ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఆయన కెరీర్​ను ఓ మలుపు తిప్పిన సినిమాగా చరిత్రకెక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..

Chiranjeevi Tagore Movie
Chiranjeevi Tagore Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 10:49 AM IST

Chiranjeevi Tagore Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో నటించిన సూపర్ హిట్​ మూవీ 'ఠాగూర్​'. 2003 సెప్టెంబరు 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. అశేష ప్రేక్షకాదరణ పొంది బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఆయన కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా 'ఠాగూర్‌' నిలిచింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కొన్ని గురించి ఆసక్తికర విశేషాలు..

  1. తమిళ నటుడు విజయ్‌కాంత్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రమణ'. ఇదే సినిమాను తెలుగులో చిరు రీమేక్‌ చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. 'రమణ' సినిమాలో ఎలాంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్​ ఉండవు. పైగా ఇందులోని మెయిన్​ లీడ్​ చివరకు మృతిచెందుతాడు. ఈ విషయాన్ని చిరంజీవి తన స్నేహితుడితో పంచుకుంటే.. 'సర్‌.. మీకు ఈ సినిమా సెట్​ కాదు. మీ పాత్ర చనిపోతే, నిర్మాత చనిపోయినట్టే' అని అన్నారట.
  2. ఈ సినిమాకు దర్శకుడిగా మాతృకను తీసిన మురుగదాస్‌నే అనుకున్నారు. కానీ, ఆయన పాటలు లేకుండానే చిత్రీకరిస్తానని కండీషన్​ పెట్టారట. అంతే కాకుండా 'రమణ పాత్ర ఒక త్యాగమూర్తి అది చనిపోకుండా తీయడం కూడా కుదరదు' అని అన్నారట.
  3. అలా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిరంజీవి అప్పటికి ఫామ్‌లో ఉన్న యువ దర్శకుడు వి.వి.వినాయక్​ను ఎంచుకున్నారు. ఓ రోజు నటుడు రాజా రవీంద్ర వచ్చి,'మిమ్మల్ని చిరంజీవి తీసుకురమ్మన్నారు' అని వినాయక్‌కు చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. చిరుకి వీరాభిమాని అయిన వినాయక్‌కు అసలు విషయం చెప్పడంతో ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట.'రమణ రీమేక్‌ చేయాలనుకుంటున్నాం. ఎలా ఉంటుంది' అని చిరు అడిగితే 'మీకు చాలా బాగుంటుంది' అని వినాయక్‌ సమాధానం చెప్పి, పాటలు, క్లైమాక్స్‌ ఎలా మార్చాలో ఆయనకు వివరించారట.
  4. ఇక చిరు సీఎం అయితే, ఎలా ఉంటుంది? ఎలాంటి డైలాగ్స్​ చెబుతారు? అని అప్పటికే వినాయక్‌ ఓ కథ రాసుకుని ఉన్నారట. అందులోని కొన్ని డైలాగ్స్‌కు చిరుకు బాగా నచ్చడంతో వినాయక్‌ను ప్రోత్సహించారు. పరుచూరి బ్రదర్స్‌ 'ఠాగూర్​'కు డైలాగ్స్​ అందించారు. అలా వినాయక్‌ దర్శకత్వంలో 'ఠాగూర్‌' సినిమా పట్టాలెక్కింది.
  5. శ్రియ, జ్యోతికలను హీరోయిన్స్​గా, శాయాజీ శిండేను విలన్‌గా ఎంపిక చేశారు. సునీల్‌, కె.విశ్వనాథ్‌, ప్రకాశ్‌రాజ్‌, రమా ప్రభ, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాస రావు లాంటి స్టార్స్​ను కీలక పాత్రలకు ఎంచుకున్నారు.
  6. 2003 సెప్టెంబరు 24లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. 'ఏసీఎఫ్‌' అనే పేరుతో అవినీతిపై ఠాగూర్‌ అనే ప్రొఫెసర్‌ చేసే పోరాటం చూసి అందరూ ఈ సినిమా 'భారతీయుడు'లా ఉందని అన్నారు. కానీ, నెమ్మదిగా ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.
  7. చిరంజీవి యాక్టింగ్​, డ్యాన్స్‌, ఫైట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ గణాంకాల గురించి సింగిల్‌ టేక్‌లో చిరంజీవి చెప్పే డైలాగ్‌, క్లైమాక్స్‌లో కోర్టు సీన్‌కు అభిమానులే కాదు, సగటు సినీ ప్రేక్షకుడు ఫిదా అయిపోయారు. అలాగే ఆ సమయంలో ఆస్పత్రుల్లో జరుగుతున్న మోసాలను ఎత్తి చూపుతూ తీసిన సీన్‌ సినిమాలో మరో హైలైట్‌. 'తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించటం' అంటూ చిరు చెప్పిన డైలాగ్‌ బాగా అప్పట్లో బాగా ఫేమస్‌ అయింది.
  8. ఇందులో డైరెక్టర్​ వినాయక్‌ ఒక పాత్ర చేశారు. చిరంజీవి సూచన మేరకే వినాయక్‌ ఆయన ఈ సినిమాలో స్టూడెంట్​లా కనిపిస్తారు.
  9. మొత్తం 600లకు పైగా థియేటర్‌లలో ఈ సినిమా రిలీజైంది. 253 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు చిత్రంగా 'ఠాగూర్‌' రికార్డుకెక్కింది. అంతేకాదు, 191 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
  10. శ్రీశ్రీ రాసిన 'నేను సైతం..' గీతాన్ని ఆధారంగా తీసుకుని, రచయిత సుద్దాల అశోక్‌ తేజ మార్పులు చేసి, క్లైమాక్స్‌ సాంగ్‌ రాశారు. ఈ పాటకు గాను ఆయన ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
  11. ప్రభుత్వంతో పని చేయించుకోవటం మన హక్కు, ఆ హక్కుని లంచంతో కొనొద్దు అన్న చిరంజీవి స్వరంతోనే సినిమా మొదలై, అదే డైలాగ్​తో ముగుస్తుంది.
  12. ఇందులో చైల్డ్​ ఆర్టిస్టులుగా నటించిన తేజ సజ్జా, కావ్యా కల్యాణ్‌రామ్‌ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Chiranjeevi Aishwarya Rai : ఇది చదివారా.. చిరంజీవి కోసం ఐశ్వర్యా రాయ్​!

Chiranjeevi Vasishta Movie : 'మెగా 157' రిలీజ్ టార్గెట్​ ఇదే.. ఆ రోజు మిస్​ అయిందా నెక్ట్స్ ఇక​ అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.