ETV Bharat / entertainment

రజనీ స్ఫూర్తితోనే చిరు సెకెండ్​ ఇన్నింగ్స్​.. 24 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్‌ వద్ద 'ఢీ'.. ఇద్దరూ తమన్నాతోనే..

author img

By

Published : Aug 9, 2023, 2:28 PM IST

Chiranjeevi Rajinikanth Box Office Clash : సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోలు చిరంజీవి, రజనీకాంత్​.. నటించిన చిత్రాలు.. బాక్సాఫీస్​ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. మరి ఇలా గతంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే ఆ సినిమాలేంటి? ఆ విషయాలు మీకోసం.

Chiranjeevi Rajinikanth Movies Box Office Clash Bholashankar Jailer

Chiranjeevi Rajinikanth Box Office Clash : టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి, తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్​.. హీరోలుగా తెరకెక్కిన చిత్రాలు.. ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో అంతటా ఆసక్తి నెలకొంది. బాక్సాఫీస్​ వద్ద పోటీ పడుతున్న వీరిద్దరిలో విజయం ఎవరు దక్కించుకుంటారోనన్ని చర్చ.. మూవీ లవర్స్​లో మొదలైంది. అయితే ఈ ఇద్దరు టాప్​ హీరోలు.. తమ చిత్రాలోత పోటీపడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు.. రోజు వ్యవథిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి నటించిన సినిమాలతోపాటు.. బాక్సాఫీస్​ వద్ద పోటీ పడ్డ చిత్రాల గురించి తెలుసుకుందాం.

1979లో స్టార్ట్​..
Chiranjeevi Rajinikanth Movies : చిరంజీవి, రజనీకాంత్ చిత్రాలు.. రోజుల గ్యాప్​లో రిలీజ్​ అవ్వడం 1979లో మొదలైంది. దర్శకుడు కొమ్మినేని శేషగిరి రావు తెరకెక్కించిన తాయారమ్మ బంగారయ్య సినిమా ఆ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అయితే, ఇందులో చిరు.. పూర్తిస్థాయి పాత్ర పోషించలేదు. కృష్ణ, రజనీకాంత్‌ కలిసి నటించిన ఇద్దరూ అసాధ్యులే జనవరి 25న రిలీజ్‌ అయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అదే ఏడాది సెప్టెంబరు 5న సీనియర్​ ఎన్టీఆర్​, రజనీకాంత్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నందమూరి రమేశ్‌ రూపొందించిన టైగర్‌ విడుదలైంది. అదే సమయంలో చిరంజీవి హీరోగా దర్శకుడు కె. వాసు తెరకెక్కించిన కోతలరాయుడు సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మోసగాడు X రామ్‌
Chiranjeevi Rajinikanth Boxoffice : ఆ తర్వాత ఏడాది.. చిరంజీవి, రజనీకాంత్​ మరోసారి పోటీ పడ్డారు. శోభన్‌ బాబు, చిరు ప్రధాన పాత్రల్లో దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మోసగాడు చిత్రం 1980 మే 22న విడుదలైంది. ఈ మూవీలో చిరంజీవి నెగెటివ్‌ రోల్‌ ప్లే చేశారు. అదే నెల 31న కృష్ణ, రజనీకాంత్‌, చంద్రమోహన్‌ ప్రధాన పాత్రల్లో విజయ నిర్మల రూపొందించిన రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌.. ప్రేక్షకుల ముందుకొచ్చింది.

నరసింహాగా రజనీ అదుర్స్​
సూపర్​స్టార్​ ఇమేన్​ను ఒక్కసారిగా మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం నరసింహ. కె.ఎస్‌. రవికుమార్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 1999 ఏప్రిల్‌ 10న విడుదలకాగా.. చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రులు ఏప్రిల్‌ 30న రిలీజైంది. కె. రాఘవేంద్రరావు దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.

24 ఏళ్ల తర్వాత ఇలా..
సుమారు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి చిత్రాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన జైలర్ ఆగస్టు 10న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కించిన భోళాశంకర్‌ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్‌ తమన్నా నటించడం విశేషం.

ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలివే..
Chiranjeevi Rajinikanth Movies : చిరంజీవి, రజనీకాంత్​.. ఎన్నో వేదికలపై ఇరువురు తమ స్నేహం గురించి పంచుకున్నారు. కాళి అనే సినిమాలో రజనీకాంత్‌, చిరంజీవి తొలిసారి కలిసి నటించారు. ఐ.వి. శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రజనీ టైటిల్‌ పాత్ర పోషించగా, జీకే అనే పాత్రను తమిళ వెర్షన్‌లో విజయ్‌కుమార్‌ పోషించారు. అదే పాత్రలో తెలుగులో చిరంజీవి నటించారు. 1980లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత వీరిద్దరూ రణువ వీరన్‌లో కలిసి నటించారు. 1981లో విడుదలైందీ చిత్రం. బందిపోటు సింహం’ పేరుతో తెలుగులో 1982లో రిలీజైంది.

రజనీ స్ఫూర్తితోనే చిరు అలా..
Chiranjeevi Second Innings : అయితే మద్రాసు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చిరంజీవికి రజనీకాంత్‌ సీనియర్‌ అంట. చిరంజీవి శిక్షణ తీసుకుంటున్న సమయంలో రజనీ కూడా వచ్చి ఒకట్రెండు క్లాస్‌లు చెప్పారట. తాను నటుడిని కావడానికి రజనీ కూడా స్ఫూర్తి అని చిరు పలు సందర్భాల్లో చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను మళ్లీ సినిమా చేయాల్సి వస్తే, అందుకు రజనీకాంత్‌ రోబోను స్ఫూర్తిగా తీసుకుని, సినిమాలు చేస్తానని చిరు అప్పట్లో చెప్పుకొచ్చారు. అన్నట్లుగానే రాజకీయాలను పక్కన పెట్టి ఖైదీ నంబర్‌ 150లో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు భోళా శంకర్‌తో రజనీకి పోటీ ఇస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.