ETV Bharat / entertainment

'గ్యాంగ్​ లీడర్​' రీ రిలీజ్​ పోస్ట్​పోన్​.. అందుకేనా? - గ్యాంగ్ లీడర్​ రీ రిలీజ్​ వాయిదా

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. సక్సెస్​ క్రేజ్​ను వినియోగించుకుని.. గ్యాంగ్​ లీడర్​ చిత్రాన్ని రీ రిలీజ్​కు ప్లాన్ చేసిన మేకర్స్​కు పెద్ద షాకే తగిలింది. ఆ వివరాలు..

Gang leader postpone
మెగా ఫ్యాన్స్​కు షాక్​.. 'వాల్తేరు వీరయ్య' సక్సెస్​​ ఏమైపోయిందో?
author img

By

Published : Feb 8, 2023, 4:08 PM IST

Updated : Feb 8, 2023, 6:39 PM IST

మెగాస్టార్ ఫ్యాన్స్​కు నిరాశ ఎదురైంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య భారీ సక్సెస్​ అందుకోవడంతో .. ఆయన నటించిన గ్యాంగ్ లీడ‌ర్​ను తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్ర‌వ‌రి 11న రీ రిలీజ్​కు సన్నాహాలు చేశారు. అయితే ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో బుకింగ్స్ కాలేదని సమాచారం అందింది. దీంతో మేకర్స్​ మంచి సందర్భం చూసి రిలీజ్​ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకే రీరిలీజ్​ను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.

ధనుశ్​ క్రేజ్​ మాత్రం.. అయితే రీ రిలీజ్​ ట్రెండ్​లో భాగంగా.. ఓ చిత్రాన్ని మళ్లీ విడుదల చేసేముందు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని చేసున్నారు మేకర్స్​. కానీ తమిళ స్టార్ హీరో ధనుశ్​-శ్రుతిహాసన్​ నటించిన '3' మూవీని మాత్రం ఏ సందర్భం లేకుండానే రిలీజ్ చేశారు. అయినా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా రీ రిలీజ్ సమయంలో ఓ థియేటర్లలో 3 సినిమాను వీక్షించడానికి వచ్చిన హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా.. సినిమాకు వచ్చిన రెస్పాన్స్​ చూసి తెగ సంతోషపడిపోయింది. థియేటర్లోనే చిందులు కూడా వేసింది. ఆ వీడియో అప్పుడు తెద వైరల్​గా అయింది.

ఇకపోతే.. గ్యాంగ్ లీడర్​ విషయానికొస్తే.. విజ‌య బాపినీడు ద‌ర్శ‌క‌త్వంలో 1991లో వచ్చిన ఈ చిత్రం బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. విజ‌య‌శాంతి హీరోయిన్‌. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగ్స్ అందించారు. చిరంజీవి హీరోయిజం స్టైల్​, డైలాగ్స్ అప్పట్లో అభిమానుల‌ను తెగ ఉర్రూతలూగించాయి. శ‌ర‌త్‌కుమార్‌, సుమ‌ల‌త, ముర‌ళీమోహ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అప్పట్లో 50కిపైగా థియేట‌ర్ల‌లో శ‌త‌దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకుందీ చిత్రం.

ఇదీ చూడండి: మళ్లీ సెట్స్​పైకి స్టార్ హీరో మూవీ.. 5 ఏళ్ల తర్వాత రిలీజ్​కు రెడీ!

Last Updated : Feb 8, 2023, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.