ETV Bharat / entertainment

చిరుతో సల్మాన్​ స్టెప్పులు.. బాక్సాఫీస్​ షేక్​! - చిరు సల్మనాా ఖాన్​

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' సినిమా నుంచి అదిరే అప్డేట్​ వచ్చింది. బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​తో కాలు కదిపానని చిరు ట్వీట్​ చేశారు. దీంతో మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.

chiranjeevi-dance-with-salman-khan-in-godfather-movie

author img

By

Published : Jul 29, 2022, 4:12 PM IST

Chiranjeevi Salman Khan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్​స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, చిరంజీవి, సల్మాన్ ఖాన్​పై వచ్చే ఓ గీతాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్​ను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్​ చేశారు.

భాయ్​తో (సల్మాన్ ఖాన్) కాలు కదిపానని, ప్రభుదేవా అద్భుతంగా నృత్యరీతులు సమకూర్చారని చిరంజీవి పేర్కొన్నారు. ఈ పాట కచ్చితంగా కన్నులపండుగలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అప్డేట్​తో మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చిరు, సల్మాన్​ డ్యాన్స్​తో థియేటర్ దద్దరిల్లిపోద్దని కామెంట్లు పెడుతున్నారు. 'గాడ్ ఫాదర్' చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు.

ఓటీటీలో పృథ్వీరాజ్​ సుకుమారన్ 'కడువా'​..
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా షాజీ కైలాస్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం 'కడువా'. సంయుక్త మేనన్‌ కథానాయిక. వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలో నటించారు. జులై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఆగస్టు 4వ తేదీ నుంచి 'కడువా' స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఇవీ చదవండి: చైతూపై సామ్​కు ఇంకా ప్రేమ తగ్గలేదా?.. మళ్లీ ఆ ఇంటిని..

అనన్య ఒడిలో విజయ్‌.. లోకల్​ ట్రైన్​లో సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.