ETV Bharat / entertainment

పిలుపు మారినా 'ప్రేమ' తగ్గలేదు- చిరంజీవితో మల్టీస్టారర్ చేస్తా: హీరో వెంకటేశ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 7:37 AM IST

Chiranjeevi And Venkatesh Movie : టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేశ్​, చిరంజీవి ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు వెంకీ మామ. త్వరలోనే మెగాస్టార్​తో సినిమా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

Chiranjeevi And Venkatesh Movie
Chiranjeevi And Venkatesh Movie

Chiranjeevi And Venkatesh Movie : టాలీవుడ్ స్టార్ కథానాయకుడు విక్టరీ వెంకటేశ్​ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం సైంధవ్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‍లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు-సైంధవ్‌ పేరిట హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.

నాన్న కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే!
కలియుగ పాండవులు సినిమాతో తెరంగేట్రం చేసినల విక్టరీ వెంకటేశ్, ఈ వేడుకలో పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. నాన్న రామానాయుడు బలమైన కోరిక, అన్నయ్య సురేశ్ బాబు ప్రోత్సాహంతోనే తాను కథానాయకుడిని అయ్యానని చెప్పారు. "గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కలియుగ పాండవులు మూవీతో నా ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌ తదితర అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానుల ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాల్ని చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాల్ని గమనించి ప్రోత్సహించారు. మొదట్లో విక్టరీ అనేవారు. తర్వాత రాజా అని పిలిచారు. కొన్నాళ్లు పెళ్లికాని ప్రసాద్‌ అన్నారు. తర్వాత పెద్దోడు, వెంకీ మామ అన్నారు. ఇలా పిలుపు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే ఎప్పటికప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నాను" అని తన ఎనర్జీ సీక్రెట్ చెప్పారు.

హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా!
"చాలా సార్లు తన సినీ కెరీర్‌ను వదిలి పెట్టి వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను ఇచ్చేవారు. నా తోటి హీరోలైన బాలకృష్ణ, నాగార్జున వీళ్లంతా పాజిటివ్‌ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా చిత్రాలను కొనసాగించాను. నా 75వ చిత్రం సైంధవ్‌ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందరినీ అలరిస్తుంది. కృషి, పట్టుదల, నిలకడతోనే విజయాలు సాధ్యం అవుతాయి. ఎక్కువ హైరానా పడకుండా సహజంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఏదైనా రావాల్సిన సమయంలోనే వస్తుంది. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా" అని తెలిపారు.

కలియుగ పాండవులు టు సైంధవ్- 'వెంకీ 75' స్పెషల్​ ఈవెంట్​లో వీరే ఫుల్ అట్రాక్షన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.