ETV Bharat / entertainment

నేషనల్ ఛాంపియన్​గా నటి ప్రగతి- ఇన్​స్టాలో ఎమోషనల్ పోస్ట్​!

Character Artist Pragathi National Championship : టాలీవుడ్ సినీయర్ నటి ప్రగతి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు ఆమె ఇన్​స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్​ పెట్టారు.

Character Artist Pragathi National Championship

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 8:04 PM IST

Updated : Nov 28, 2023, 8:29 PM IST

Character Artist Pragathi National Championship : టాలీవుడ్​ చిత్రాల్లో తల్లి, వదిన వంటి పాత్రలు పోషిస్తూ నటి ప్రగతి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాకుండా ప్రగతి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటారు. తరచూ తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు అభిమానులతో షేర్​ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమె నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. మూడో ప్లేస్​లో నిలిచి కాంస్య పతకం సాధించారు సాధించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

తాజాగా బెంగళూరు వేదికగా 28వ పురుషులు, మహిళల నేషనల్​ లెవెల్ 'బెంచ్‌ ప్రెస్‌ ఛాంపియన్‌ షిప్‌' పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న నటి ప్రగతి.. మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురచేశారు. బెంగళూరులోని ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆడిటోరియంలో ఈ పోటీలు జరిగాయి. ఎంతో మంది పవర్‌ లిఫ్టర్లతో పోటీ పడి మరీ ప్రగతి ఈ మెడల్​ను సాధించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. 'నా జీవితం చెడు నిర్ణయాలు, హార్ట్​ బ్రేక్స్, డెడ్​ ఎండ్స్​తో నిండి ఉంది. కానీ, ఇలాంటివి కూడా నాకు ఉత్సాహాన్నిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడాలన్నది జీవితానికి విజయ మంత్రం' అని భావోద్వేగంగా రాసుకొచ్చారు. అయితే ప్రగతి ఈ మెడల్ గెలవడం పట్ల.. సినీ పరిశ్రమకు చెందిన వారు, అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు.

Actress Pragathi Career : ప్రగతి 1976 మార్చి 17న ఆంధ్రప్రదేశ్​ ఒంగోలు సమీపంలోని ఉలవపాడులో జన్మించారు. ప్రగతి మొదటి 'మైసూర్​ సిల్క్​ ప్యాలెస్​' కోసం మోడల్​గా కెరీర్​ ప్రారంభించారు. ఆ తర్వాత కె భాగ్యరాజ్​ దర్శకత్వంలో 'వీట్ల విశేషంగా' అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. అలా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు / సీరియళ్లలో నటించారు. తెలుగులోనే ఆమె 100కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ప్రగతి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో అమ్మ, వదిన పాత్రలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి హీరోగా ఇటీవల వచ్చిన 'భోళాశంకర్‌'లోనూ ప్రగతి కనిపించారు.

పవన్​ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డైలాగ్​ లీక్​- 'యానిమల్' విలన్ అంత పని చేశాడా!

చిలుకపచ్చ చీరలో మాళవిక​.. కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా నడుము అందాలు!

Last Updated : Nov 28, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.