ETV Bharat / entertainment

ఆ సినిమా కోసం 2 నెలలు నిద్రపోకుండా పనిచేసిన కీరవాణి! - చంద్రముఖి 2 మూవీ రిలీజ్​ డేట్​

Chandramukhi 2 music director : ఆస్కార్‌ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి.. ఓ సినిమా కోసం రెండు నెలల పాటు నిద్రపోకుండా పనిచేశారని తెలిపారు. ఆ వివరాలు..

Chandramukhi 2 music director
ఆ సినిమా కోసం 2 నెలల నిద్రపోకుండా పనిచేసిన కీరవాణి!
author img

By

Published : Jul 24, 2023, 8:37 AM IST

chandramukhi 2 music director : టాలీవుడ్​లో ఎన్నో హిట్​ పాటలను అందించి శ్రోతల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. మరకత మణిగా తమిళులకూ, ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌గా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవలే 'ఆర్‌ఆర్‌ఆర్‌' నాటు నాటు సాంగ్​తో ఆస్కార్‌ అందుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదిగారు ఈ ఆస్కీరవాణి.

తాజాగా ఈ మధుర రాగాల మాంత్రికుడు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. తాను రెండు నెలల పాటు నిద్రపోకుండా ఓ సినిమాకు సంగీతం అందించినట్లు తెలిపారు. ఆ చిత్రమే 'చంద్రముఖి 2'. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఓ కొత్త అప్డేట్​ను సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ఫస్​ కాపీని ఆయన చూసి తన అభిప్రాయాన్ని తెలిపారు. "ఈ చిత్రంలోని పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులను గడుపుతాయి. ఆ అద్భుతమైన సీన్స్​ కోసం నేను 2 నెలల పాడు నిద్రపోకుండా సంగీతం అందించాను" అని కీరవాణి పేర్కొన్నారు. అలాగే సంగీత దర్శకులు గురుకిరణ్‌, విద్యాసాగర్‌ ఆశీస్సులను కూడా కోరారు.

ఇక కీరవాణి చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్​మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై సినీ ప్రియులు, పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. 'సినిమా కోసం అలాగే మీ బీజీఎమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం, లక.. లక.. లక' అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

rajinikanth chandramukhi movie : ఇకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా 2005లో విడుదలైన సినిమా చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా 'చంద్రముఖి 2' తెరకెక్కింది. ఈ రెండు సినిమాలను పి. వాసు దర్శకత్వం వహించారు.

ఇప్పుడు రెండో భాగంలో రాఘవ లారెన్స్‌ హీరోగా నటించారు. రాజ నర్తకిగా బాలీవుడ్‌ ప్రముఖ యాక్టర్​ కంగనా రనౌత్‌ కనిపించనుంది. అప్పట్లో తొలి భాగానికి విద్యాసాగర్‌ సంగీతం అందించారు. ఇప్పుడు సీక్వెల్​కు కీరవాణి అందించారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా సెప్టెంబరులో పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్​గా విడుదల కానంది.

ఇదీ చూడండి :

బిజీ బిజీగా కంగనా రనౌత్​.. 'చంద్రముఖి 2' ఫొటోస్​ షేర్ చేసిన భామ

'రజనీకాంత్​ కాలితో తన్నితే అభిమానులు ఊరుకుంటారా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.