Bro OTT Streaming : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్రో : ది అవతార్'. ఇందులో ఆయన తన మేనల్లుడు మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించారు. ఇటీవలే గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. అలాగే ఎన్నో రాజకీయ వివాదాలను ఎదుర్కొంది. అయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఆగస్ట్ 25న ఓటీటీలోకి వచ్చేసింది. తొలి రోజే డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రంతో పాటు ఆగస్ట్ 25 ఆనంద్ దేవరకొండ బేబీ కూడా ఓటీటీలోకి వచ్చి మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంది.
Bro Movie Collections : 'బ్రో' చిత్రం జులై 28న రిలీజైంది. అయితే ఈ సినిమా.. పవన్ స్టార్ స్టేటస్‌కు తగ్గట్టు హిట్ కాలేదని మొదట టాక్ వచ్చింది. ఎందుకంటే పవన్ రేంజ్‌కు తగ్గట్టు ఒక్క పాట, ఫైట్ లేదని చాలా మంది అన్నారు. కానీ ఈ చిత్రం ఫామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్‌లో 70 కోట్ల రూపాయిల వరకు అందుకుంది. 'అత్తారింటికి దారేది', 'వకీల్ సాబ్' తర్వాత 'బ్రో ది అవతార్' చిత్రమే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. బ్రో సినిమా ముందు వచ్చిన భీమ్లానాయక్‌కు కేవలం అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పర్వాలేదనింపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Bro VS Baby Movie OTT Response : ఇకపోతే ఈ చిత్రం రీసెంట్‌గానే ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 25న వచ్చింది. తొలి రోజు డీసెంట్ రెస్పాన్సే అందుకున్నట్లు తెలిసింది. తొలి రోజు 24 గంటల్లో 70 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చాయని అంటున్నారు. పవన్ రేంజ్‌కు ఇది తక్కువనే చెప్పాలి! అయితే ఈ రేంజ్ వ్యూస్ రీసెంట్గా వచ్చిన ఏ బడా చిత్రానికి రాలేదట. ప్రభాస్ ఆదిపురుష్‌కు మొదటి 24 గంటల్లో 50 మిలియన్ వాచ్ మినిట్స్ మాత్రమే వచ్చాయట. అయితే ఇదే సమయంలో 'బ్రో'తో పాటు వచ్చిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య 'బేబీ'(Baby OTT Response) 32 గంటల్లో ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది.
-
#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
— Geetha Arts (@GeethaArts) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA
">#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
— Geetha Arts (@GeethaArts) August 26, 2023
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA#BabyTheMovie emerges as a BLOCKBUSTER on OTT also, reaching a jaw-dropping 100 million views in just 32 hours on @ahavideoIN ! ❤️🔥#CultBlockbusterBaby is ruling the small screens, too! 🤩
— Geetha Arts (@GeethaArts) August 26, 2023
Watch the heart-warming love story at your homes now! ❤️ pic.twitter.com/UEBoZaBAyA
Baby OTT Release : OTTలోకి కల్ట్ బ్లాక్ బస్టర్.. వామ్మో.. ఒక్కరోజులోనే ఈ రేంజ్ రెస్పాన్సా?