ETV Bharat / entertainment

'బ్ర‌హ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. మేకర్స్​ అన్ని కోట్లు న‌ష్ట‌పోయారా?

రణ్​బీర్​ కపూర్​ నటించిన బ్ర‌హ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​ క్యాన్సిల్​ అవ్వడం వల్ల మేకర్స్​ బాగానే నష్టపోయారని తెలిసింది. ఎన్ని కోట్లంటే

bramhastram pre release event
బ్ర‌హ్మ‌స్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​
author img

By

Published : Sep 3, 2022, 1:12 PM IST

Updated : Sep 3, 2022, 3:10 PM IST

ప్ర‌స్తుతం ఉత్తరాది హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకునే ప‌నిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే విడుద‌లైన 'పృథ్విరాజ్', 'లాల్ సింగ్ చ‌డ్డా', 'షంషేరా' వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా వ‌సూళ్ళు సాధించ‌లేక‌పోయాయి. ఇక‌ షంషేరాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ర‌ణ్‌బీర్ ఇప్పుడు 'బ్ర‌హ్మాస్త్ర‌ం'తో ఎలాగైనా తెలుగులో భారీ విజ‌యం సాధించాల‌ని ఆరాటపడుతున్నారు.

అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని తెలుగులో దర్శకధీరుడు రాజ‌మౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఫాంట‌సీ అడ్వేంచ‌ర్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుదల కానుంది. ఈ క్ర‌మంలోనే మేక‌ర్స్ హిందీతో పాటు తెలుగులోనూ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగానే రామోజీఫిలిం సిటీలో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. దానికి త‌గ్గట్టే సెట్‌ను కూడా నిర్మించారు. ఇక‌ ఈ వేడుక‌కు ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలిచారు. కానీ చివ‌రి నిమిషంలో పోలీస్‌ల నుంచి ప‌ర్మిష‌న్ రాక‌పోవ‌డం వల్ల ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ క్ర‌మంలో బ్ర‌హ్మాస్త్రం టీమ్​ ప్రెస్ మీట్‌ను నిర్వ‌హించింది.

అయితే క్యాన్సిల్​ అయిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేక‌ర్స్ దాదాపు రూ.2.25 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని తెలిసింది. అంత మొత్తం ఖ‌ర్చు పెట్టి.. చివ‌రి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అవ‌డంతో మేక‌ర్స్‌ కాస్త నిరాశ‌ప‌డ్డార‌ట‌. ఇక ప్రెస్​ మీట్​ కోసం సుమారు 10ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారట. కాగా, ఈ చిత్రం మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున‌ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌గా మౌనీరాయ్ విల‌న్ పాత్ర‌లో న‌టించింది.

ఇదీ చూడండి: రణ్​బీర్​కు తెలుగు నేర్చుకోవడానికి అన్ని రోజులు పట్టిందా?

Last Updated : Sep 3, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.