బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా 'బ్రహ్మాస్త్ర' ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే సెప్టెంబర్ 23వ తేదీన నేషనల్ సినిమా డే సందర్భంగా మూవీ యూనిట్.. కేవలం రూ.75కే టికెట్ ధర నిర్ణయించింది. మల్టీప్లెక్స్లోనూ రూ.75కే టికెట్లు లభించడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపించారు. దాదాపుగా థియేటర్లలో ఆరోజు 85% ఆక్యుపెన్సీ కనిపించింది. దీంతో టికెట్ రేటు తగ్గిస్తే ప్రేక్షకులు సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం అర్థం చేసుకున్న సినిమా యూనిట్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రకటన చేసింది.
దసరా శరన్నవరాత్రులు సందర్భంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సినిమాను కేవలం రూ.100కే చూడొచ్చని దర్శకుడు అయాన్ ముఖర్జీ పేర్కొన్నారు. కాగా, 'బ్రహ్మస్త్ర' చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారని సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లు వసూళ్లను రాబట్టిందని తెలిసింది.
-
Celebrate Navratri with #Brahmastra!
— BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September.
Book your tickets now!
BMS - https://t.co/qjPVPFdZfT
Paytm - https://t.co/eVmK21uC8n
T&C Apply* pic.twitter.com/vz7Du38dUG
">Celebrate Navratri with #Brahmastra!
— BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022
Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September.
Book your tickets now!
BMS - https://t.co/qjPVPFdZfT
Paytm - https://t.co/eVmK21uC8n
T&C Apply* pic.twitter.com/vz7Du38dUGCelebrate Navratri with #Brahmastra!
— BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022
Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September.
Book your tickets now!
BMS - https://t.co/qjPVPFdZfT
Paytm - https://t.co/eVmK21uC8n
T&C Apply* pic.twitter.com/vz7Du38dUG
ఇవీ చదవండి: రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్.. అన్ని కోట్లా?
సితారకు మహేశ్ స్పెషల్ విషెస్.. తన ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుందంటూ..