ETV Bharat / entertainment

Brahmanandam Allu Arjun :  బ్రహ్మానందం నివాసంలో బన్నీ సందడి.. ఆ ఇద్దరికి విషెస్ తెలుపుతూ​.. - అల్లు అర్జున్ అప్డేట్స్

Brahmanandam Allu Arjun : టాలీవుడ్​ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నివాసానికి ఇటీవలే ఐకాన్​ స్టార్​ అల్లు అల్లు అర్జున్‌ వెళ్లి సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి వెళ్లిన ఆయన.. ఇటీవల వివాహం చేసుకున్న బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్‌ - ఐశ్వర్య దంపతులను కలిసి అభినందనలు తెలిపారు.

Brahmanandam Allu Arjun
బ్రహ్మానందం నివాసంలో అల్లు అర్జున్​
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 7:14 AM IST

Updated : Aug 26, 2023, 7:45 AM IST

Brahmanandam Allu Arjun : టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నివాసానికి ఇటీవలే ఐకాన్​ స్టార్​ అల్లు అల్లు అర్జున్‌ వెళ్లి సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి వెళ్లిన ఆయన.. ఇటీవల వివాహం చేసుకున్న బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్‌ - ఐశ్వర్య దంపతులను కలిసి అభినందనలు తెలిపారు. వారి కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు.

Brahmanandam Allu Arjun
బ్రహ్మానందం నివాసంలో అల్లు అర్జున్​

Allu Arjun National Award : మరోవైపు ఉత్తమ నటుడిగా బన్నీ జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం పట్ల బ్రహ్మానందం హర్షం వ్యక్తం చేశారు. బొకే అందజేసి ప్రత్యేకంగా విషెస్​ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. బ్రహ్మానందంతో అల్లు అర్జున్‌కు ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలోనూ బ్రహ్మానందం ఓ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని స్వయంగా స్కెచ్‌ వేసి అల్లు అర్జున్‌కు బహుమతిగా అందించారు.

Bramhanadam Gift To Allu Arjun : ఆ ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేసిన బన్నీ ఓ ఎమోషనల్ నోట్​ రాసుకొచ్చారు. ఆయనకెంతో ఇష్టమైనబ్రహ్మానందం నుంచి ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ రావడం ఆనందంగా ఉందని అన్నారు. ''నాకు వచ్చిన గిప్ట్‌లన్నింటిలో ఇదే గొప్పది. 45 రోజలు కఠిన శ్రమ.. చేతితో వేసిన ఈ పెన్సిల్ స్కెచ్ ఎంతో బాగుంది. ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.

  • THE MOST PRICELESS GIFT I RECEIVED FROM OUR BELOVED
    BRAHMANANDAM GARU.
    45 DAYS OF WORK .
    HAND DRAWN PENCIL SKETCH . THANK YOU 🙏🏽 pic.twitter.com/DNvGd3iv3B

    — Allu Arjun (@alluarjun) January 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Best Actor National Award 2023 : మరోవైపు 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు నేషనల్​ అవార్డు రావడం పట్ల నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, మయాంక్‌ హర్షం వ్యక్తం చేశారు. బన్నీని కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఇక సోషల్ మీడియాలోనూ బన్నీ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు నెట్టింట అభినందనలు తెలుపుతున్నారు.

Bramhanandam Son Marriage : ఇక ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్‌ వివాహం ఆగస్టు 19న హైదరాబాద్‌లో గ్రాండ్​గా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను దీవించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల బన్నీ ఈ పెళ్లికి హాజరు కాలేకపోయారట. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Allu Arjun National Award : 20 ఏళ్ల బన్నీ కెరీర్​లో ఛాలెంజింగ్​ పాత్రలు.. చూస్తే జారిన నోర్లు మూసుకోవాల్సిందే!

Allu Arjun National Award : 'అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు మాత్రం ఆర్మీ.. నా లైఫ్​లో ఆమె ప్రభావం ఎంతో ఉంది'

Last Updated : Aug 26, 2023, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.