ETV Bharat / entertainment

Ask Me SRK: షారుక్​- విజయ్​ కాంబోలో సినిమా?.. క్లారిటీ ఇచ్చిన బాద్​షా! - షారుక్​ ఖాన్​ ట్వీట్స్​

Shahrukh Khan Ask Me SRK : బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. విజయ్​- షారుక్​ కాంబోలో సినిమా రాబోతుందా? 2022 టీ20 వరల్డ్​ కప్​ ఫైనల్​కు వెళ్తారా? బూర్జ్​ ఖలీఫా చెప్పే స్పెషల్​ విషస్​పై ఫీలింగ్​? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఆయన మాటల్లోనే..

ask me srk session on twitter
ask me srk session on twitter
author img

By

Published : Nov 5, 2022, 4:21 PM IST

Updated : Nov 5, 2022, 4:42 PM IST

Shahrukh Khan Ask Me SRK : బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తన అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 'ఆస్క్‌ మీ షారుక్' అంటూ ట్విట్టర్ చాట్‌ సెషన్‌ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సుమారు 15 నిమిషాల పాటు ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఫ్యాన్స్​ అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు బాద్​షా.. తనదైన స్టైల్​లో రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్​.."మీరు విజయ్​ దళపతితో దిగిన ఫొటో చూస్తే చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరి కాంబినేషన్​లో సినిమా రాబోతుందా?" అంటూ ప్రశ్నించారు. దీనికి షారుక్​ స్పందిస్తూ.. " ఆయన చాలా మంచి వ్యక్తి. సినిమా అంటే చెప్పలేం. అయితే అవ్వొచ్చు.. లేకపోతే లేదు" అని షారుక్​ బదులిచ్చారు.

మీరు అంత హాట్​గా ఉండడానికి కారణమేంటి?
షారుక్: అదంతా పేరీ పేరీ సాస్​తో చికెన్​ తినడం వల్లే అనుకుంటా.

కొవిడ్​ తర్వాత మీలో వచ్చిన మార్పులేమిటి?
షారుక్:​ అన్నింటి పనులను తొందరిగా పూర్తి చేయాలనే తపనను​ తగ్గించుకుంటున్నాను.

ఏ వీడియో గేమ్​ మీరు ఆడుతున్నారు?
షారుక్​: నా చిన్న కుమారుడు ఆడుతున్న ఫోర్ట్​నైట్​ వీడియో గేమ్​ను నేను కూడా ఆడుతున్నాను.

2007 ఫైనల్‌లో భారత్ గెలిచినప్పుడు మేము మిమ్మల్ని స్టేడియంలో చూశాము. ఇప్పుడు టీమ్​ఇండియా మళ్లీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, మీరు మ్యాచ్​ చూడడానికి వెళ్తారా?
షారుక్: అంతా దేవుడి దయ. టీమ్​ఇండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది.

జాన్​ అబ్రహం, సిద్ధార్థ్​ ఆనంద్​, దీపికా పదుకొణెలతో వర్క్​ చేయడం ఎలా ఉంది?
షారుక్:​ వాళ్లందరితో వర్క్​ చేయడం చాలా ఆనందంగా ఉంది.

మీరు ఎప్పుడూ కింగ్​లాగే ఎలా ఉంటారు?
షారుక్:​ చెడు కంటే మంచి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని నమ్మాలి. ఎప్పుడే అది సాధ్యం.

అక్షయ్​ కుమార్​, సల్మాన్​ ఖాన్ గురించి మీ అభిప్రాయం?
షారుక్​: వారిద్దరూ హార్డ్​ వర్కర్స్​. కొన్నేళ్లుగా ఇద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్​.

నేను నా గర్ల్​ ఫ్రెండ్​తో కలిసి పఠాన్​కు సినిమాకు వెళ్దాం అనుకున్నా.. కానీ ఈ లోపల ఆమెకు పెళ్లి అయిపోయింది. ఇప్పుడెలా?
షారుక్:​ ఏం పర్లేదు బ్రో.. నీవు ఒక్కడివి వచ్చి కూడా సినిమాను చూడొచ్చు.

మీరు ఎప్పుడైనా ఒంటరిగా మాట్లాడుకున్నారా?
షారుక్:​ నో నో నో.. నేను ఎప్పుడూ అలా ఒంటరిగా లేను.

మీ బర్త్​డే రోజు మిమ్మల్లి చూడడానికి వచ్చిన అభిమానులను అబ్రామ్​ చూసి ఏమనుకుని ఉంటాడు?
షారుక్​: మా నాన్నకు విషెస్​ చెప్పడానికి వచ్చిన కొన్ని వేల మంది ఫ్యాన్స్​ను చూసి హ్యాపీగా ఫీలయ్యి ఉంటాడు.

బర్త్​డే నాడు బూర్జ్​ ఖలీఫా మీకు స్పెషల్​గా విషెస్​ చెప్పడంపై ఫీలింగ్​ ఏంటి?
షారుక్:​ బూర్జ్ ఖలీఫా టీమ్ ఎల్లప్పుడూ నాపై చాలా ప్రేమ చూపిస్తుంది. అదొక మంచి అనుభూతి.

ask me srk session on twitter
షారుక్​కు బూర్జ్​ ఖలీఫా స్పెషల్​ విషెస్​

Last Updated : Nov 5, 2022, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.