ETV Bharat / entertainment

ఈ స్టార్ ​కిడ్​కి వరుసగా 9 డిజాస్టర్​లు - ఇప్పుడు 250 కోట్ల సినిమా! ఇదీ అసలు కథ!! - అర్జున్ కపూర్ కొత్త సినిమా

Bollywood Actor Arjun Kapoor In Singham Series : వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితేనే.. నెగెటివ్ ఇంక్రెషన్ క్రియేట్ అవుతుంది. కానీ.. ఆ నటుడికి మాత్రం కంటిన్యూగా 9 చిత్రాలు "డిజాస్టర్​" టేస్ట్​నే చూపించాయి. కెరియర్ మొత్తంలో ఒక్కటే సూపర్ హిట్. అయినా.. ఆఫర్లు తగ్గట్లేదు. ఇప్పుడు.. 250 కోట్ల సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఇంతకీ ఎవరతను? దీని వెనక రీజన్ ఏంటి..??

Arjun Kapoor In Singham Series
Bollywood Actor Arjun Kapoor In Singham Series
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 4:24 PM IST

Bollywood Actor Arjun Kapoor In Singham Series : సినీ నటులకు స్టార్​డమ్ పెరగాలన్నా.. ఆఫర్లు క్యూ కట్టాలన్నా.. "సక్సెస్" కంపల్సరీ. అయితే.. కొందరి విషయంలో ఈ థియరీ అప్లై కాదు. సక్సెస్​తో సంబంధం లేకుండా అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. మారిన పరిస్థితులే! గతంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన హిట్లను బట్టే.. నెక్ట్స్​ సినిమా అవకాశాలు ఉండేవి. కానీ.. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో.. ఆఫర్ల కొలతలు మారిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉంటూ.. కంటిన్యూస్​గా వార్తల్లో ఉంటే చాలు.. అవకాశాలు వాటంతట అవే వస్తున్నాయి! ఈ కారణంగానే.. ఒక్క హిట్​లేకపోయినా కొందరు హీరో, హీరోయిన్లు వరుస ఛాన్సులు అందుకుంటూనే ఉన్నారు!

వరుసగా 9 డిజాస్టర్లు.. అయినా ఆఫర్లు..!

హిట్లు లేకున్నా అవకాశాలు అందుకుంటున్న వారిలో.. బీటౌన్​ హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఇతనో స్టార్ కిడ్. బాలీవుడ్​లో వేళ్లూనుకున్న కుటుంబం అండతో ఇండస్ట్రీతో అడుగు పెట్టాడు. తొలి రెండు చిత్రాలు తప్ప.. ఆ తర్వాత ఒక్క సక్సెస్ కూడా టేస్ట్ చేయలేకపోయాడు. వరుసగా 9 డిజాస్టర్లు ఫేస్ చేశాడు. అయినా.. ఇతనికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే.. సగటు ప్రేక్షకుడికి ఇది నెపోటిజంలా అనిపించవచ్చు. కానీ కారణాలు వేరే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది జనం నోళ్లలో నానుతూ ఉండటమే!

పేరు చివర కపూర్​తో పాటు తండ్రి, నిర్మాత బోనీ కపూర్, బాబాయిలు అనిల్, సంజయ్ కపూర్‌ నుంచి ఎంత సపోర్ట్​ ఉన్నా.. హిట్​ కొట్టడం మాత్రం అర్జున్​కు సాధ్యం కావట్లేదు. అర్జున్​తొలి సినిమా ఎటువంటి అంచనాలు లేకుండానే విడుదలై సక్సెస్ సాధించింది. రెండేళ్ల తర్వాత వచ్చిన మలి చిత్రం "2 స్టేట్స్‌" సూపర్ ​హిట్​గా నిలిచింది. అర్జున్ సినిమాల్లో.. ఇప్పటివరకు చెప్పుకోదగింది ఇది మాత్రమే! ఆ తర్వాత ఒక్కటి కూడా థియేటర్లలో కనీస వసూళ్లకి నోచుకోలేదు. 2016 నుంచి ఇప్పటివరకు అర్జున్ కపూర్.. తొమ్మిది చిత్రాలలో నటించాడు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద నీటిబుడగల్లా పేలిపోయాయి.

సల్మాన్​ ఖాన్​ 'టైగర్​-3'కు మరాఠి సినిమా సవాల్! - డైరెక్ట్​ చేసింది ఎవరో తెలుసా?

హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, ముబారకన్, నమస్తే ఇంగ్లండ్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, పానిపట్, సందీప్ ఔర్ పింకీ ఫరార్, ఏక్ విలన్ రిటర్న్స్, కుట్టే.. చివరగా ఇటీవలే విడులైన ది లేడీ కిల్లర్ ఈ లిస్టులో ఉన్నాయి. ఇంత బ్యాడ్​ఫామ్​తో బాలీవుడ్​ జనాలంతా అర్జున్​ని ఈ తరం బిగెస్ట్​ఫ్లాఫ్​ యాక్టర్ ​అనడం మొదలుపెట్టారు.

అయితే.. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే! ఇన్ని పరాజయాలు ఉన్నా.. అర్జున్​కి ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ స్టార్​కిడ్​ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి "మేరీ పత్నీకా" రీమేక్. కాకపోతే ఈ సినిమా బడ్జెట్​ చాలా పరిమితం. ఒక రకంగా Low Budget ​సినిమా అని చెప్పుకోవచ్చు. రెండో సినిమా ఆఫర్ మాత్రం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. "సింగం" సిరీస్​లో భాగంగా రోహిత్​​శెట్టి తెరకెక్కిస్తున్న "సింగం ఎగైన్"​లో అర్జున్​ కపూర్​కీలక పాత్ర పోషిస్తున్నాడు.

రూ.250 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సింగం సిరీస్​లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్​ లేకపోవడం.. ఒకదానికి మించి ఒకటి కలెక్షన్ల కొత్త రికార్డులు నెలకొల్పుతుండటమే ఇందుకు కారణం. ఇలాంటి మూవీలో అర్జున్​ కపూర్​కి ఛాన్స్ రావడంతో.. ఈ సినిమాతోనైనా బ్రేక్​ వస్తుందా? అనే చర్చ ఇటు నెటిజన్లతోపాటు అటు బీటౌన్​లో కూడా నడుస్తోంది. ఈ మూవీలో అర్జున్ నెగెటివ్ ​షేడ్స్ ​ఉన్న రోల్ ప్లే చేస్తున్నట్టు బాలీవుడ్​ టాక్​. మరి, ఈ చిత్రం తర్వాత ఏం జరుగుతుంది? సక్సెస్ అందుకొని హీరోగా కంటిన్యూ అవుతాడా? లేక విలన్​ అవతారం ఎత్తుతాడా? అన్నది చూడాల్సి ఉంది.

'ఆరోగ్యం దెబ్బతింది, సినిమాలు ఫ్లాప్, విడాకుల సమస్య'- సమంత ఎమోషనల్

8000 మందితో సినిమా షూటింగ్​ - భారతీయుడి కోసం శంకర్​ భారీ ప్లాన్​​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.