ETV Bharat / entertainment

'ఆ మూవీలో నా రోల్​ కొత్తగా ఉంటుంది - నా కంఫర్ట్‌ జోన్‌లో అస్సలు లేదు' - బాబీ దేవోల్‌ లేటెస్ట్ మూవీస్

Bobby Deol Kanguva Movie : యానిమల్ మూవీతో తనలోని సరికొత్త షేడ్స్​ను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్‌​. ఇక తాజాగా ఆయన 'కంగువా' సినిమాలో మరో డిఫరెంట్ రోల్​ చేయనున్నట్లు తెలిపారు. ఇంతకీ ఆ రోల్​ ఎలా ఉండనుందంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 1:51 PM IST

Bobby Deol Kanguva Movie : 'యానిమల్​' సినిమాతో యావత్ సినీ ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్నారు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్‌​. సినిమాలో ఆయనది చిన్నపాత్రే అయినప్పటికీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన గురించే చర్చలు జరుగతున్నాయి. ఆయన ఎటువంటి సినిమాల్లో నటిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. అయితే ఆయన గతంలోనే 'హరి హర వీరమల్లు'తో పాటు కంగువ సినిమాకు సైన్ చేసినట్లు పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. దీంతో ఆయన రోల్​ గురించి తెలుసుకోవాలంటూ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఆయన 'కంగువా'లో తన రోల్​ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో తన కంఫర్ట్ జోన్ దాటి మరీ నటించానంటూ తెలిపారు. అంతే కాకుండా ఇందులో ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. ఇది విన్న ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. యానిమల్​లో విలన్​ పాత్రతో మెప్పించిన బాబీ ఈ సినిమలోనూ ఓ సూపర్ రోల్​తో ప్రేక్షకుల ముందుకొస్తారని ఆశిస్తున్నారు.

"కంగువా మూవీ టీమ్ నాకెంతో నచ్చింది. సూర్య యాక్టింగ్​ అద్భుతంగా ఉంటుంది. అలాంటి అంకితభావం ఉన్న హీరోతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి తమిళ సినిమా. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర నా కంఫర్ట్‌ జోన్‌లో లేదు. ఎందుకంటే నాకు ఈ భాష తెలియదు. రెండు నెలల్లో తమిళం నేర్చుకోలేను" అని అన్నారు.

ఇక 'కంగువా' విషయానికొస్తే.. డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏకంగా 38 భాషల్లో విడుదల కానుంది. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతోందని మేకర్స్​ రివీల్​ చేశారు. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. జగపతి బాబు, యోగిబాబు లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం గ్రాండ్​గా విడుదల కానుంది.

'కంగువా' నుంచి క్రేజీ అప్డేట్​- ఏకంగా 38 భాషల్లో రిలీజ్‌!

'కంగువా' సెట్స్​లో ప్రమాదం - హీరో సూర్యకు గాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.