ETV Bharat / entertainment

Bipasha Basu Daughter Surgery : '10 నెలల కుమార్తెకు హార్ట్​ సర్జరీ.. లైవ్​లో కంటతడి పెట్టిన బిపాసా.. ఆ ఐదు నెలలు..

Bipasha Basu Daughter Surgery : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు ఇటీవలే తన చిన్నారి గురించి ఓ షాకింగ్​ విషయం చెప్పుకొచ్చారు. ఇన్​స్టాలో జరగిన ఓ లైవ్​లో ఈ విషయాన్ని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ ఆ చిన్నారికి ఏం జరిగిందంటే..

Bipasha Basu Daughter Surgery
Bipasha Basu Daughter Surgery
author img

By

Published : Aug 6, 2023, 12:55 PM IST

Bipasha Basu Daughter Surgery : బాలీవుడ్ స్టార్ కపుల్​ బిపాసా బసు- కరణ్​ సింగ్​ గ్రోవర్​ గతేడాది నవంబర్‌లో దేవీ అనే పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ఆ చిన్నారి రాకతో ఎంతో ఆనందపడ్డ జంట..తమ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయితే బిపాషా ఇటీవలే ఇన్​స్టా వేదికగా తన పాప గురించి ఓ షాకింగ్​ న్యూస్​ చెప్పుకొచ్చారు. తన గారాలపట్టికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలతో జన్మించింటూ లైవ్​లో భావోద్వేగానికి లోనయ్యారు. పుట్టిన మూడో రోజే తమకు ఈ విషయం తెలిసిందని చెప్పుకొచ్చిన ఆమె.. తన చిన్నారికి మూడు నెలల వయసులోనే తనకు సర్జరీ చేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. అంతే కాకుండా బిపాసా తన ప్రెగ్నెన్సీ జర్నీతో పాటు తల్లిగా తను ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పకొచ్చారు.

"దేవి పుట్టిన మూడు రోజులకే తన గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని మాకు తెలిసింది. తనకు వెంట్రిక్యులర్‌ సెప్టల్‌ డిఫెక్ట్‌ ఉంది దాన్ని సరి చేయాలంటే తనకు సర్జరీ చేయాలన్నారు. అప్పుడు మాకు అసలు వీఎస్‌డీ అంటే ఏంటో కూడా తెలియదు. చాలా బాధపడ్డాం. అయితే ఆ బాధనంతా దిగమింగుకుంటూ నవ్వుతూ కనిపించాం. ఇటువంటి నరకం ఏ తల్లికీ రాకూడదు. కనీసం ఈ విషయాన్ని మేము మా ఫ్యామిలీ మెంబర్స్​కు కూడా చెప్పలేదు. తన రాకను ఎంతో గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసుకుందామనుకున్నాముయ. కానీ ఈ విషయం తెలిసి మా మనసు ముక్కలైంది. మొదటి ఐదు నెలలు మాకు చాలా కష్టంగా గడిచింది. అయితే దేవి మాత్రం మొదటిరోజు నుంచే ఎంతో యాక్టివ్​గా ఉంది. తనకు మూడు నెలల వయసున్నప్పుడు మేము స్కానింగ్‌కు తీసుకెళ్లాం. అంత చిన్న పసిపాపకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అంటే చెప్పలేనంత బాధేసింది. కరణ్‌ కూడా దీనికి సిద్ధంగా లేడు, కానీ నేను మాత్రం పాప వీలైనంత త్వరగా ఈ గండం నుంచి గట్టెక్కాలనుకున్నాను. సుమారు ఆరు గంటలపాటు ఈ ఆపరేషన్‌ జరిగింది. అప్పుడు నా జీవితమే ఆగిపోయినట్లనిపించింది. చివరకు ఆపరేషన్‌ సక్సెస్‌ కావడం వల్ల ఊపిరి పీల్చుకున్నాం" అంటూ కంటతడి పెట్టుకున్నారు బిపాసా బసు.

International Yoga Day : ఈ అందాల భామలు యోగాతోనే డే స్టార్ట్​ చేస్తారట!!

కాజల్​ అగర్వాల్​ టు అమీ జాక్సన్​.. తల్లులైనా తగ్గేదే లే.. అదే అందం అదే ఫిజిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.