ETV Bharat / entertainment

బింబిసార్ 2 అప్డేట్​.. షూటింగ్​ షురూ అయ్యేది అప్పుడే - కల్యాణ్​ రామ్​ బింబిసార 2 షూటింగ్​

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బింబిసార' ఇటీవలే విడుదలై సూపర్​ హిట్ టాక్​ను దక్కించుకుంది. అయితే తాజాగా ఈ చిత్ర సీక్వెల్​పై అప్డేట్​ ఇచ్చారు వశిష్ట.

Bimbisara 2 update
బింబిసార్ 2 అప్డేట్​.. షూటింగ్​ షురూ అయ్యేది అప్పుడే
author img

By

Published : Oct 28, 2022, 6:59 PM IST

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బింబిసార'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీలో కూడా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని చిత్రబృందం గతంలో ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వశిష్ట మాట్లాడారు.

"సోషియో ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార చిత్రాన్ని అందరూ ఎంతగానో ఆదరించారు. ఊహించని విజయాన్ని అందించారు. ప్రస్తుతం వాళ్లందరూ ఈ సినిమా సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్నారు. నేను అభిమానులందరికీ కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించనున్నాం. మొదటిభాగం భారీ హిట్‌ సాధించినందున రెండో భాగం దానికి మించి తీయాలనే ఒత్తిడి నాపై ఉంది. కల్యాణ్‌ రామ్‌ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార2 సినిమా షూటింగ్‌ మొదలవుతుంది" అని చెప్పారు.

ప్రస్తుతం కల్యాణ్​రామ్​ 'డెవిల్‌' సినిమాలో నటిస్తున్నారు. నవీన్‌ మేడారం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ది బ్రిటిష్ సీక్రెట్‌ ఏజెంట్‌' అనేది ఉపశీర్షిక. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.

ఇదీ చూడండి: నటి నిత్యామేనన్ ప్రెగ్నెంట్​ పోస్ట్​.. గందరగోళంలో ఫ్యాన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.