Sohel Mr Pregnant Trailer : బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ప్రెగ్నెంట్ ట్రైలర్. టైటిల్‌తోనే ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఎన్నో కష్టాలను దాటుకోని ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రాన్ని అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం ఫన్ అండ్ ఎమోషన్స్‌తో సాగింది.
ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే ఓ కుర్రాడు.. ప్రేమ, పెళ్లి అంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేలోపు అతడి జీవితం ఓ ఊహించని మలుపు తిరుగుతంది. ఓ మగాడు గర్భం దాలిస్తే.. అతడు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రంలో చూపించారు.
'నా పేరు గౌతమ్. నాది మంచి క్రేజీ లైఫ్.. ఓ క్రేజీ గర్ల్ ఫ్రెండ్' అంటూ సొహెల్ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత 'ఇది అందరి లైఫ్‌లో ఉండేదే బ్రో.. కానీ నా లైఫ్‌లో ఓ ట్విస్ట్' అంటూ సొహెల్ ప్రెగ్నెంట్ అవడం, దాంతో అతడు ఎదుర్కొన్న అవమానాలను, ఇబ్బందులు వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ను కట్ చేశారు.
MR pregnant telugu movie cast : ఇక ట్రైలర్ చివర్లో తన కడుపులో బిడ్డ కోసం సొహెల్ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌లు మనసుల్ని హత్తుకునేలా ఉన్నాయి. ఎమోషన్ సీన్లను అతడు బాగా హ్యాండిల్ చేశాడు. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మైక్ మూవీస్ పతాకంపై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా సినిమాను రూపొందించారు. శ్రవణ్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి :
Rajnikanth kamalhassan : రజనీ.. కమల్ రేంజ్లో సక్సెస్‌ను అందుకుంటారా?
NTR Devara movie shooting : 'దేవర' కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నారా?