ETV Bharat / entertainment

Bhola Shankar Hindi Version : బీటౌన్​లోకి 'భోళాశంకర్'​ ఎంట్రీ.. ఆ స్టార్​ హీరో సహాయంతో.. - Bhola Shankar movie release

Bhola Shankar Hindi Version : మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'భోళా శంకర్​'. తమన్న, కీర్తి సురేశ్​ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో హిందీలోనూ విడుదల కానుందట. ఇంతకీ ఎప్పుడంటే ?

Bhola Shankar Hindi Version
Bhola Shankar Hindi Version
author img

By

Published : Aug 15, 2023, 9:36 AM IST

Updated : Aug 15, 2023, 11:20 AM IST

Bhola Shankar Hindi Version : టాలీవుడ్​ మెగాస్టార్​ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్'. మెహర్ రమేశ్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలు అందుకుని థియేటర్లలో రన్​ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ సరికొత్త అప్డేట్​ నెట్టింట హల్​చల్​ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలోనూ రానుంది. అయితే రీమేక్​గా కాకుండా ఈ సినిమా హిందీ వెర్షన్​లో విడుదల కానుంది. అక్కడ కూడా 'భోళా శంకర్' అనే పేరుతోనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని హిందీ డబ్బింగ్​ రైట్స్​ను కొనుగోలు చేసిన ఆర్​కేడీ స్టూడియోస్​ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా హిందీ వెర్షన్ టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి పాత్ర‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరో జాకీ ష్రాఫ్ డ‌బ్బింగ్ చెప్పారు.

మరోవైపు తెలుగులో రిలీజయ్యేందుకు ముందే ఈ సినిమాను హిందీలోకి డ‌బ్ చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నారట. అందుకుగానూ బాలీవుడ్​ నిర్మాణ సంస్థ ఆర్‌కేడీ స్టూడియోస్‌కు 'భోళాశంకర్'​ థియేట్రికల్​ రైట్స్​ను తెలుగు మేకర్స్​ ఇచ్చారట. అయితే ఆగ‌స్ట్ 11న తెలుగుతో పాటు హిందీలోనూ 'భోళాశంక‌ర్‌'ను రిలీజ్ చేయాల‌ని మేకర్స్​ ప్లాన్ చేశారట. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, డబ్బింగ్​ ఆలస్యమైనందున ఇప్పుడు ఆగ‌స్ట్ 25న 'భోళాశంకర్​' హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chiranjeevi Bhola Shankar Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. త‌మిళ స్టార్ హీరో అజిత్​ నటించిన సూపర్​ హిట్​ మూవీ 'వేదాళం'కు రీమేక్‌గా 'భోళాశంక‌ర్' తెర‌కెక్కింది. ఇందులో చిరంజీవి సరసన మిల్క్​ బ్యూటీ త‌మ‌న్నా న‌టించగా.. ఆయన సోద‌రిగా కీర్తి సురేశ్​ మెరిశారు. హీరో సుశాంత్, రఘుబాబు, రవిశంకర్, మురళీ శర్మ, రష్మీ గౌతమ్ వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

Last Updated : Aug 15, 2023, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.