ETV Bharat / entertainment

Bhagavanth kesari World wide business : 'భగవంత్​ కేసరి' మేనియా షురూ.. రెండు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్​ బిజినెస్ ఎంత జరిగిందంటే? - బాలకృష్ణ సినిమా

Bhagavanth kesari World wide business : బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్​లో రూపొందిన లేటెస్ట్​ మూవీ 'భగవంత్​ కేసరి' అక్టోబర్ 19న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు వరల్డ వైడ్​గా ప్రీ రిలీజ్​ బిజినెస్ ఎంత జరిగిందంటే ?

Bhagavanth kesari World wide business : భగవంత్​ కేసరి ప్రీ రిలీజ్​ బిజినెస్ ఎంతంటే..!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 7:58 PM IST

Bhagavanth kesari World wide business : నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్​ రావిపూడి రూపొందించిన చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. చిత్ర యూనిట్ విడదల చేసిన ట్రైలర్​తో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే సినిమాకు సంబంధించి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఓ రేంజ్​లో థియేట్రికల్ బిజినెస్ చేసింది.

మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 67.35 కోట్లు వ్యాపారం జరిగిందని సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 59.25 కోట్లు అందుకోగా.. మిగతా భారత దేశం అంతా కలిపి రూ. 4.25 కోట్లు.. ఓవర్సీస్​ హక్కులు రూ. 6 కోట్లకు అమ్ముడుపోయాయని టాక్​ నడుస్తోంది. ఈ క్రమంలో బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల్లో ఇది మూడో స్థానానికి చేరింది. 'వీరసింహారెడ్డి' రూ. 73 కోట్లతో, 'ఎన్.టి.ఆర్' రూ. 70 కోట్లు బిజినెస్​తో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, 'భగవంత్ కేసరి' హిట్ అవ్వాలంటే మాత్రం రూ. 68.50 కోట్లు రావాల్సిందేని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో రూ. 57.10 కోట్లకు సినిమా హక్కులు అమ్మడుపోయాయట. ప్రాంతాల వారీగా చూస్తే.. నైజాంలో రూ. 14.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, గుంటూరులో రూ. 6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4 కోట్లు, కృష్ణాలో రూ. 4 కోట్లు, నెల్లూరులో రూ. 2.60 కోట్ల వ్యాపారం జరిగిందని టాక్​.

Bhagavanth Kesari Cast : ఈ సినిమాలో హీరోయిన్​గా కాజల్​ అగర్వాల్.. కీలక రోల్​లో శ్రీలీల నటించారు. విలన్​ పాత్రను అర్జున్ రాంపాల్ పోషించారు. దీనికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్​తో రానుంది. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్​తో మూవీపై హైప్​ను మరింత పెంచేశాయి. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ యాక్షన్ ప్యాక్​డ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bhagavanth Kesari Overseas Booking : 'లియో'ను కాదని.. బాలయ్య మూవీ టికెట్లు కొంటున్న తమిళ ఫ్యాన్స్​!

Big boss Bhagvant Kesari : బిగ్ బాస్​లో 'భగవంత్ కేసరి'.. గత 20ఏళ్ల బాలయ్య కెరీర్​లో తొలి సారి అలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.