Bhagavanth Kesari Movie Collection : దసరా కానుకగా థియేటర్లలో విడుదలై సంచలనాలు నమోదు చేస్తోంది 'భగవంత్ కేసరి'మూవీ. 'ఆఖండ', 'వీరసింహారెడ్డి', తర్వాత బాలయ్యకు హ్యాట్రిక్ ఇచ్చింది ఈ సినిమా. రిలీజైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసిన 'భగవంత్ కేసరి' ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఏడో రోజులోకి అడుగుపెట్టేసింది. అయితే వీకెండ్స్‌తో పాటు దసరా వేడుకల కారణంగా కలెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ఆరో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 104 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మూవీ టీమ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్ల పంట పండింది. నైజాంలో - రూ.13.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.95 కోట్లు, ఉత్తరాంధ్ర- రూ. 3.95cr, గుంటూరు- రూ. 5.18 కోట్లు, కృష్ణ- రూ. 2.68 కోట్లు, నెల్లూరు - రూ. 1.85 కోట్లు, ఈస్ట్ గోదావరి- 2.46 కోట్లు, వెస్ట్ గోదావరి- రూ. 2.28 కోట్లు, కర్ణాటక రూ. 3.9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 0.5 కోట్లు, యూఎస్‌లో రూ. 6.5 కోట్ల కలెక్షన్లను అందుకుందని ట్రేడ్ వర్గాల టాక్ .
తాజాగా 'దంచవే మేనత్త కూతురా' పాటను రీ క్రియేట్ చేసి ఈ సినిమాకు జోడించారు. దీంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. స్క్రీన్‌పై ఈ పాట వస్తే ఇక అంతే.. థియేటర్లలో ఫ్యాన్స్ ఈలలు డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ పాట సినిమాకు జోడించడం కాస్త ప్లస్ పాయింట్ అయ్యింది. తొలి సారి ఈ పాటను థియేటర్లో మిస్ చేసుకున్న ఫ్యాన్స్ రెండో సారి ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారట.
-
Danchave menattha kuthura Song added after End Cards...#DasaraWinnerKesari #BlockbusterBhagavanthKesari pic.twitter.com/n6dOzxjU7b
— À J À ¥ ™ (@AjayBalayya) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Danchave menattha kuthura Song added after End Cards...#DasaraWinnerKesari #BlockbusterBhagavanthKesari pic.twitter.com/n6dOzxjU7b
— À J À ¥ ™ (@AjayBalayya) October 24, 2023Danchave menattha kuthura Song added after End Cards...#DasaraWinnerKesari #BlockbusterBhagavanthKesari pic.twitter.com/n6dOzxjU7b
— À J À ¥ ™ (@AjayBalayya) October 24, 2023
Bhagavanth Kesari Cast : ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ భారీ యాక్షన్ మూవీలో బాలకృష్ణ, కాజల్‌తో పాటు శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ నటించారు. ఇందులో బాలకృష్ణ లుక్సే కాదు డైలాగ్స్ కూడా కొత్తగా ఉన్నాయి. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్‌కు ఫ్యాన్స్ థియేటర్లలో విజిల్స్ మోత మోగించారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ను అందించారు.
-
This DASARA is UNANIMOUS & belongs to #BhagavanthKesari 😎💥#DasaraWinnerKesari WW Grosses sensational 1️⃣0️⃣4️⃣CR & going super strong at the box office🔥
— Shine Screens (@Shine_Screens) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/CKl3XArKYn
">This DASARA is UNANIMOUS & belongs to #BhagavanthKesari 😎💥#DasaraWinnerKesari WW Grosses sensational 1️⃣0️⃣4️⃣CR & going super strong at the box office🔥
— Shine Screens (@Shine_Screens) October 25, 2023
- https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/CKl3XArKYnThis DASARA is UNANIMOUS & belongs to #BhagavanthKesari 😎💥#DasaraWinnerKesari WW Grosses sensational 1️⃣0️⃣4️⃣CR & going super strong at the box office🔥
— Shine Screens (@Shine_Screens) October 25, 2023
- https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/CKl3XArKYn
Bhagvant Kesari Sequel : 'భగవంత్ కేసరి' సీక్వెల్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి
Bhagvant Kesari Movie : గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య.. ఇక థియేటర్లు మోతే.. ఫ్యాన్స్ పండగ చేసుకోండి