ETV Bharat / entertainment

ఆ బుడ్డోడికి గిఫ్ట్​గా సల్మాన్ బ్రేస్​లెట్​, ఫామ్​హౌస్​.. ఎవరా లక్కియస్ట్ చైల్డ్! - సల్మాన్​ ఖాన్​తో భారతీ సింగ్ కుమారుడు గోలా

ప్రముఖ బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్.. తాను సెంటిమెంట్​గా భావించే బ్రేస్​లెట్​ను​, తన ఫామ్​హౌస్​ను ఓ బుడ్డోడికి సంక్రాంతి కానుకగా ఇచ్చేశారు! ఆ సంగతేంటో చూద్దాం..

Salman Khan Bracelet
సల్మాన్​ ఖాన్​ బ్రేస్​లెట్​
author img

By

Published : Jan 13, 2023, 10:50 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ ప్రస్తుతం పలు సినిమాలతో పాటు హిందీలో ఎంతో ప్రేక్షాకదరణ కలిగిన బిగ్​బాస్​ సీజన్​ 16కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే ఈ షో 15 సీజన్లను పూర్తి చేసుకుంది. కాగా తాజాగా ఈ షో కి సంబంధించిన ఓ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరలవు​తోంది. వీడియో విడుదలైన గంటల వ్యవధిలోనే లక్షల కొద్ది వ్యూస్​ను సంపాదించింది. ఇంతకీ ఏముంది ఈ వీడియోలో అనుకుంటున్నారా..

ప్రముఖ పంజాబీ లేడీ కమిడియన్​ భారతీ సింగ్​.. తన భర్త హార్ష్​ లింబాచియాతో కలిసి బిగ్​బాస్​కు అతిథిగా హాజరయ్యారు. అంతేగాక తమ 9 నెలల కుమారుడినీ షోకు తీసుకు వచ్చారు. అయితే షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్​ను కలవడానికి వచ్చిన ఈ దంపతులు కాసేపు స్టేజీపై నవ్వులు పూయించారు.

షో ప్రారంభ సమయంలో భారతీ సింగ్​ దంపతులను వేదిక పైకి ఆహ్వానించారు సల్మాన్​. అయితే భారతీ తమ కుమారుడు లక్ష్​ సింగ్​ లింబాచియా(గోలా)ను కూడా వేదిక పైకి తీసుకువచ్చారు. వీరు సల్మాన్​తో చేసిన సందడి అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ క్రమంలోనే ఆమె 'సారే వాదే యాద్​ హై సల్మాన్​ భాయ్​'(సల్మాన్​ ఖాన్​ అన్న గారిచ్చిన అన్ని హామీలు నాకు గుర్తుకున్నాయి).. అలాగే మీరు నా కుమారుడిని ఎలా లాంఛ్​​ చేస్తారన్న విషయం కూడా నాకు గుర్తుంది అని నవ్వుతూ అన్నారు.

స్టేజీపైకి తన కుమారుడిని తీసుకొచ్చిన భారితీ.. 'బుడ్డోడిని ఎత్తుకోని అలిసిపోయాను కాసేపు వీడిని మీరు ఎత్తుకోండి' అని ఫన్నీగా సల్మాన్​తో అనడం... ఆ వెంటనే సల్మాన్​ ఖాన్​ కూడా 'కచ్చితంగా మీరు అలిసిపోతారు' అని జోక్​ చేయడం కితకితలు పెట్టించింది. ఈ ఫన్నీ సంభాషణల మధ్యలో సల్మాన్.. తాను​ ఎంతో సెంటిమెంట్​గా భావించే తన చేతికి ఉన్న బ్రేస్​లెట్​ను తీసి భారతీ కుమారుడు గోలాకి సంక్రాంతి కానుకగా బహుకరించారు. దీనికి వెంటనే స్పందించిన భారతీ.. 'సల్మాన్​ మీరు ఉండే పాన్వెల్​ ఫామ్​హౌస్​ను ఖాళీ చేయాలి.. ఎందుకంటే అది నా కుమారుడు లక్ష్​ పేరు మీద బదిలీ చేశారు' అంటూ చమత్కరించారు. ఇందుకు సల్మాన్ పగలబడి​ నవ్వారు. ఇక సల్మాన్​తో మాట్లాడిన అనంతరం దంపతులిద్దరూ బిగ్​ బాస్​ హౌస్​ లోపల ఉన్న కంటెస్టెంట్స్​ను కలిసేందుకు లోపలికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్​ అవుతోంది.

కాగా, గతేడాది మేలో కూడా ఓ సినిమా షూటింగ్​ సమయంలో సల్మాన్​ భాయ్​​ చేతికుండాల్సిన బ్రేస్​లెట్​ను​ హీరోయిన్​ పూజా హెగ్డే తన చేతికి వేసుకోని ఫొటో దిగింది. అప్పట్లో ఈ ఫొటో తెగ వైరలైంది. మళ్లీ ఇప్పుడు అదే బ్రేస్​లెట్​ను మొత్తానికి భారతీ కుమారుడు గోలాకు ఇవ్వడంతో సల్మాన్​ చేతి కంకణం మరో సారి వార్తల్లోకి నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.