అన్ స్టాపబుల్ షో.. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్ హిట్లతో నందమూరి నటసింహం బాలకృష్ణ రేంజ్ పెరిగిపోయింది. అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఆయన ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.20కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం!
అయితే బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చేస్తున్న సంగతి తెలిసిందే. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రూపొందబోయే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో ఉండబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తవ్వకముందే బాలయ్య NBK 109 కథలపై కూడా ఫోకస్ పెట్టారని తెలిసింది. దీని గురించి గత కొద్ది రోజులుగా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పూరీజగన్నాథ్, క్రిష్, బోయపాటితో పాటు ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా పేర్లు ఉన్నాయి.
అయితే ఇదిలా ఉండగా.. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. బాలయ్య NBK 109ని ఓ కొత్త దర్శకుడితో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఆ దర్శకుడు ఇటీవలే తన తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నారని సమాచారం. అయితే ఈ చర్చల్లో ఓ చిన్న సమస్య వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు బాలయ్య రూ.20కోట్ల పారితోషికం తీసుకోనున్నారట. అయితే ఆ దర్శకుడు కూడా తనకు రూ.10కోట్లు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ ఆ మూవీ నిర్మాత.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తానని, నాన్ థియేట్రికల్ లాభాల్లో 20 శాతం షేర్ ఇస్తానని అంటున్నారట. అయితే దీనిపై దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. మరి ఈ చర్చలు ఫలిస్తాయో లేదో... అసలు ఆ దర్శకుడు ఎవరో, నిర్మాత ఎవరో తెలియలేదు.
ఇదీ చూడండి: సమంత పక్కా ప్లాన్.. ఇకపై దానిపైనే ఫోకస్!