NBK 108 Kajal agarwal Sreeleela dance : ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో అనిల్ రావిపూడి ఒకరు. కమర్షియల్ స్టోరీలకు కామెడీ టచ్ చేస్తూ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంటారాయన. అలానే బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను అందుకుంటున్నారు. చివరిసారిగా 'ఎఫ్ 3' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణతో NBK 108 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సెట్లో కాజల్ జాయిన్ అయింది. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ సమయంలో ఫైట్ మాస్టార్స్‌తో కలిసి అనిల్ డ్యాన్స్ చేశారు. బాలయ్య పాటకు చిందులేశారు. ఇప్పుడు దానిని బీట్ చేస్తూ కాజల్ అగర్వాల్, శ్రీలీల కలిసి సెట్స్‌లో బాలయ్య పాటకు స్టెప్పులేశారు. 'చిలకపచ్చ కోక' పాటకు అదిరిపోయే విధంగా చిందులేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను అనిల్ రావిపూడి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. "నేను బాలయ్య పాటకు వేసిన డాన్స్‌కు ఈర్ష్యగా ఫీల్ అయి.. మా హీరోయిన్స్ ఇద్దరూ నా ముందు డాన్స్ చేయడం అస్సలు ఆపడం లేదు" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
అయితే ఈ వీడియోలో కాజల్, శ్రీలీల వేసిన డాన్స్ స్టెప్పులకు అనిల్ రావిపూడి సూపర్ అంటూ విజిల్స్ వేయగా.. ఆ తర్వాత మా డ్యాన్స్ ఇంకా అయిపోలేదంటూ నాన్‌స్టాప్‌గా శ్రీలీలా, కాజల్ మరోసారి స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఇకపోతే చిందులేసేటప్పుడు ఇద్దరూ పింక్ కలర్లో సేమ్ కాస్ట్యూమ్స్ ధరించి ఫుల్ గ్లామర్‌గా కనిపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్‌గా మారింది. నెటిజన్లను, బాలయ్య అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. 'అదిరిపోయింది అంతే', 'బాలయ్య బాబు పాటలంటే ఆ మాత్రం ఊపు లేకపోతే ఎట్టా' 'కాజల్, శ్రీలీల మాస్ డాన్స్ సూపర్', అంటూ పెడుతున్నారు.
-
After, Director @AnilRavipudi set the floors ablaze with his moves 😉
— Shine Screens (@Shine_Screens) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Now, the energy bombs @MsKajalAggarwal @sreeleela14 shake their legs for #NandamuriBalakrishna's Iconic songs at the sets of #BhagavanthKesari 🔥@rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/U7aDwpX77S
">After, Director @AnilRavipudi set the floors ablaze with his moves 😉
— Shine Screens (@Shine_Screens) June 19, 2023
Now, the energy bombs @MsKajalAggarwal @sreeleela14 shake their legs for #NandamuriBalakrishna's Iconic songs at the sets of #BhagavanthKesari 🔥@rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/U7aDwpX77SAfter, Director @AnilRavipudi set the floors ablaze with his moves 😉
— Shine Screens (@Shine_Screens) June 19, 2023
Now, the energy bombs @MsKajalAggarwal @sreeleela14 shake their legs for #NandamuriBalakrishna's Iconic songs at the sets of #BhagavanthKesari 🔥@rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/U7aDwpX77S
NBK 108 teaser : రీసెంట్గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజైన టైటిల్, టీజర్ గ్లింప్స్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. బాలయ్య లుక్, తెలంగాణ యాసలో ఆయన చెప్పే మాస్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
NBK 108 టీజర్ బ్లాస్ట్.. తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య.. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో..
అఖండ - వీరసింహా - భగవంత్ కేసరి.. ఈ మూడింటిలో కామన్ పాయింట్ ఇదే!