Balakrishna Gopichand malineni movie: బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపు కొంటోంది. ఇందులో భాగంగా ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ ఆధ్వర్యంలో బాలకృష్ణపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పోరాట ఘట్టమని, బాలయ్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రామ్ - లక్ష్మణ్ దీన్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి.
యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 40రోజుల చిత్రీకరణ పూర్తయింది. ఇందులో భాగంగా రెండు పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. ప్రస్తుతం మూడో ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఓ కీలక షెడ్యూల్ కోసం త్వరలో విదేశాలకు పయనమవనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత్ బాలయ్య.. దర్శకుడు అనిల్రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. సెప్టెంబరులో ఇది మొదలు కానుంది. బాలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రను చేయబోతున్నారు.
ఇదీ చూడండి: బాలయ్య 'అన్‌స్టాపబుల్' క్రేజ్.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు