ETV Bharat / entertainment

బాలయ్య కూతురా మాజాకా.. లద్దాఖ్​లో బైక్​ రైడ్​ చేస్తూ విన్యాసాలు - లద్దాఖ్​లో నారా బ్రాహ్మణి బైక్ సాహసం

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి అదిరిపోయే సాహసం చేశారు. లద్దాఖ్‌లోని పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై రైడ్​ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Balakrishna daughter bike ride
బాలయ్య కూతురా మాజాకా.. లద్దాఖ్​లో బైక్​ రైడ్​ చేస్తూ విన్యాసాలు
author img

By

Published : Dec 2, 2022, 10:28 AM IST

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ డేర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరపైనా తెరబయటా ఎలాంటి సాహసం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దేనికి వెనకాడరు. అయితే ఇప్పుడు అదే డేరింగ్‌ను ఆయన పెద్ద కుమార్తె, హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి కూడా పునికిపుచ్చుకున్న‌ట్లు అర్థమైంది. ఆమె తాజాగా లద్దాఖ్‌లో బైక్‌ యాత్ర చేశారు. దీనికి సంబంధించిన వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆమె పర్వత సానువుల్లో మోటారు సైకిల్‌పై దూసుకెళ్తూ కనిపించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈఓలు సభ్యులుగా ఉన్న యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (వైపీఓ) ఇటీవల 'ద లడక్‌ క్వెస్ట్‌' పేరుతో నిర్వహించిన సాహస యాత్రలో బ్రాహ్మణి పాల్గొన్నట్టు సమాచారం. బ్రాహ్మణి పసుపురంగు బైక్‌ నడిపారు. యాత్రపై 'జావా యెడ్జీ మోటార్‌ సైకిల్స్‌' పేరుతో ఒక లఘుచిత్రాన్ని వైపీఓ రూపొందించింది. యాత్రలోని వారంతా తమ అనుభవాల్ని వివరించారు. "ఇప్పుడు ఉదయం 6.30 గంటలైంది. లద్దాఖ్‌ చాలా అద్భుతంగా, అందంగా ఉంది. ఇప్పుడు మేం థక్‌సే ఆరామానికి బయల్దేరుతున్నాం. మేం అసలు సిసలు ఆధ్యాత్మిక అనుభవం కోసం ఎదురు చూస్తున్నాం. అక్కడ ధ్యానం చేస్తాం" అని బ్రాహ్మణి అందులో పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు, నందమూరి అభిమానులు.. బ్రాహ్మణి ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బ్రాహ్మ‌ణి చాలా గ్రేట్ అని.. మా బాల‌య్య బాబు కూతురు సూప‌ర్ అంటూ వీడియోను సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ప్రభాస్‌ కోసం ఓ థియేటర్‌?.. షారుక్‌ యాక్షన్‌ మెరుపులు.. బ్రూస్‌లీగా దర్శకుడి తనయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.