ETV Bharat / entertainment

గ్రాండ్​గా బాలయ్య-అనిల్​ రావిపూడి సినిమా షూటింగ్​ షురూ - బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా షూటింగ్​

నందమూరి నటసింహం బాలకృష్ణ- దర్శకుడు అనిల్​ రావిపూడి కాంబో సినిమా సెట్స్​పైకి వెళ్లింది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Balakrishna aniravipudi movie starts
బాలయ్య-అనిల్​ రావిపూడి
author img

By

Published : Dec 8, 2022, 9:46 AM IST

ఆరుపదుల వయసులోనూ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాల్​ విసురుతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గతేడాది 'అఖండ'తో ఘన విజయం అందుకున్న ఆయన ప్రస్తుతం అదే జోష్‌లో 'వీరసింహా రెడ్డి' చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం సెట్స్​పై ఉండగానే దర్శకుడు అనిల్​ రావిపూడితో మరో మూవీని ప్రకటించి ఫ్యాన్స్​లో మరింత ఉత్సాహాన్ని పెంచారు.

అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ బాలయ్య-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ కూడా ఒకటి. మాస్‌, క్లాస్‌ కథ ఏదైనా బాలయ్య తనదైన శైలిలో నటించగలరు. ఇక కామెడీ, మాస్‌(సరిలేరు నీకెవ్వరు) ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తీయడంలో అనిల్‌ తనకు తానే సాటి. దీంతో ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఆయన కూతురిగా యువ నటి శ్రీలీల కనిపించనుంది. ఇకపోతే ఈ సినిమాలోని మిగతా పాత్రల కోసం బాలీవుడ్​ నటుల పేర్లను పరిశీలిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే గతంలో ఓ స్పెషల్ వీడియోను రిలీజ్​ చేసింది. ఈ వీడియో ఇంట్రో బీజీఎం అదిరిపోయింది. మూవీపై అంచనాలను బాగా పెంచేశింది.

ఇదీ చూడండి: తెలుగు హీరోయిన్స్​పై జీవిత రాజశేఖర్ కామెంట్స్​.. క్షమాపణలు చెప్పిన హరీశ్​ శంకర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.