ETV Bharat / entertainment

NBK 108 టీజర్​ బ్లాస్ట్​.. తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య.. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్​తో.. - భగవంత్​ కేసరి టీజర్ రిలీజ్​

Happy Birthday Balakrishna NBK 108 Teaser : నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్​బీకే 108 టీజర్​ను విడుదల చేసింది మూవీటీమ్​. చూసేయండి..

NBK 108 teaser
NBK 108 teaser
author img

By

Published : Jun 10, 2023, 10:23 AM IST

Updated : Jun 10, 2023, 11:12 AM IST

Happy Birthday Balakrishna : 'భగవంత్ కేసరి'గా.. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ.. విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన.. ఫన్​ డైరెక్టర్​ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'NBK 108' సినిమా చేస్తున్నారు. ఈ సినిమానే విజయదశమి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. అయితే నేడు జూన్ 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. ఇప్పటికే రెండు రోజుల ముందు టైటిల్​ అనౌన్స్​మెంట్​ చేసి అభిమానుల్లో జోష్​ నింపిన మూవీటీమ్​.. ఇప్పుడు మరో సర్​ప్రైజ్ ఇచ్చింది. టీజర్​ను రిలీజ్​ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాసలో బాలయ్య డైలాగ్స్​, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. చివర్లో బాలయ్య కాస్త కామెడీగా కూడా కనిపించారు.

బాలకృష్ణ మాస్ మేనరిజమ్స్​తో..

NBK 108 Teaser : ఈ టీజర్ మొత్తం బాలయ్య మాస్ మేనరిజమ్స్​తో రూపొందించారు. విలన్ అర్జున్ రాంపాల్ ఓ స్టిక్ సాయంతో నడుస్తూ ప్రారంభమైన ఈ టీజర్​.. ఆ తర్వాత "రాజు ఆని వెనుక ఉన్న వందల మంది మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు" అని బాలకృష్ణ చెప్పే డైలాగ్​తో ఆకట్టుకుంది. బాలయ్య హిందీలోనూ ఓ డైలాగ్​ చెప్పి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాలయ్య మార్క్ ఫైట్, గ్రాండ్ విజువల్స్ కూడా చూపించారు. "అడవి బిడ్డ నెలకొండ భగవంత్ కేసరి(ఎన్​బీకే). ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది" అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్తూ కనిపించడం కూడా బాగుంది. ఇకపోతే టీజర్​ మొత్తానికి తమన్ నేపథ్య సంగీతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. హీరోయిన్ కాజల్, యంగ్​ బ్యూటీ శ్రీ లీల, శరత్​కుమార్​ను చూపించలేదు. ప్రస్తుతానికి వారి పాత్రలను సస్పెన్స్​లో ఉంచారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

NBK 108 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. భారీ యాక్షన్​ ఎంటర్​టైన్మెంట్​గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సీనియర్ ఏజ్​ పర్సన్​గా కనిపించనున్నారు. దర్శకుడు అనిల్‌ బాలయ్యకు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్​ జోడిస్తూనే.. తన మార్క్​ ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ కాకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో ఇదే ఫస్ట్​ మూవీ కావడం విశేషం. యంగ్​​ బ్యూటీ హీరోయిన్​ శ్రీలీల- తమిళ స్టార్​ నటుడు శరత్ కుమార్ తండ్రీ కూతుర్లుగా కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

ఇదీ చూడండి :

Last Updated : Jun 10, 2023, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.