ETV Bharat / entertainment

'బలగం' సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

చిన్న సినిమాగా విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంటున్న 'బలగం' సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ చిత్రాన్ని రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.

Balagam awards
'బలగం' సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు
author img

By

Published : Mar 30, 2023, 9:25 PM IST

Updated : Mar 30, 2023, 9:34 PM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రేక్షకులు కలిసి కాసేపు సినిమాల గురించి మాట్లాడుకుంటే.. అందులో తప్పనిసరిగా 'బలగం' ప్రస్తావన తప్పకుండావస్తోంది! ఎందుకంటే ఈ చిత్రంలో పల్లెటూరు పచ్చదనం, తెలంగాణ సంస్కృతి, ఆచారాలను మనుషుల మధ్య ఉండే సంబంధాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. కమెడియన్​​ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రమిది. తన అద్భుత పనితీరుతో ఆడియెన్స్​ను కంటతడి పెట్టించారు. బంధాల కన్నా మిగతా వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత సమాజంలో.. మళ్లీ మన మూలాలను గుర్తుచేశారు. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది. ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్​ వస్తోంది. రికార్డ్​ వ్యూస్​తో దూసుకెళ్తోంది. సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులను ముద్దాడింది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిమ్​, బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిమ్​ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు అందుకుంది. ఈ మేరకు.. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ నిర్వాహకులు.. సర్టిఫికెట్స్‌ను కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను దర్శకుడు వేణు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు. 'నా బలగం చిత్రానికి మూడో అవార్డు. అంతర్జాతీయ స్థాయిలో నా బలగం గుర్తింపు తెచ్చుకుంటోంది' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ అవార్డు అందుకున్న వేణుకు అందరూ సోషల్​మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక బలగం సినిమా విషయానికొస్తే.. చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, మురళీధర్‌గౌడ్‌, సుధాకర్‌రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్​ కానుంది.

అసలు ఈ చిత్ర క‌థేంటంటే.. తెలంగాణలోని ఓ మారుమూల ప‌ల్లెలో ఈ క‌థ సాగుతోంది. సాయిలు (నటుడు ప్రియ‌ద‌ర్శి) ఓ నిరుద్యోగి. లైఫ్​లో సెటిల్ అయ్యేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ.. ల‌క్ష‌లు అప్పు చేస్తాడు. పెళ్లి చేసుకుంటే వ‌చ్చే క‌ట్నంతోనైనా అప్పులు తీర్చుకుందామనుకుంటే.. సడెన్​గా ఇంట్లో ఉన్న తాత కొముర‌య్య చ‌నిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత చావు ఇంట్లో మాటా మాటా పెరిగి కుదిరిన పెళ్లి కూడా ఆగిపోతుంది. దీంతో సాయిలు క‌ష్టాలు మరింత రెట్టింప‌వుతాయి. అయితే తాత మ‌ర‌ణంతో సూర‌త్‌లో ఉన్న బాబాయ్‌.. ఎప్పుడో 20ఏళ్ల క్రితం గొడవలతో దూర‌మైన మేన‌త్త‌, మేన‌మామ, వాళ్ల కూతురు సంధ్య (హీరోయిన్ కావ్య క‌ళ్యాణ్‌రామ్‌) ఇంటికి వస్తారు. వాళ్ల మంచి చెడులు చూసుకుంటూనే తాత అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తాడు సాయిలు. కానీ అప్పుడే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. చిన్న క‌ర్మ రోజున పిండం తినేందుకు ఒక్క కాకి కూడా రాదు. దీంతో కొముర‌య్య కొడుకు- అల్లుడి మ‌ధ్య వివాదాలు మరింత ముదురుతాయి. తాత మ‌న‌సులో ఏదో బాధ దాగి ఉందని.. అందుకే కాకులు రావ‌డం లేద‌ని.. అది ఊరికే అరిష్టం అని పంచాయ‌తీలో పెద్ద‌లు చెప్తారు. మరి పెద్ద క‌ర్మ అయిన 11వ రోజు ఏం జ‌రిగింది? కనీసం అప్పుడైనా కాకులొచ్చి పిండాన్ని తిన్నాయా లేదా? కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయా లేదా అన్నదే మిగతా కథ.

Balagam awards
'బలగం' సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు

ఇదీ చూడండి: మంచు విష్ణు-మనోజ్​ గొడవలో ట్విస్ట్​.. మరో షాకింగ్ వీడియో రిలీజ్​!

Last Updated : Mar 30, 2023, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.