ETV Bharat / entertainment

కార్తికేయ-2 ప్రచారంలో పాల్గొనకపోవడంపై అనుపమ క్లారిటీ.. కారణం అదే! - anupama parameswaran latest news

Anupama on karthikeya promotions: 'కార్తికేయ 2' సినిమా ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదో చెప్పారు హీరోయిన్​ అనుపమ పరమేశ్వరన్‌. సోషల్‌ మీడియా వేదికగా తన పరిస్థితిని వివరించారు. ఇంతకీ ఈ విషయం ఏంటో తెలుసకోండి..

anupama parameswaran on karthikeya
anupama parameswaran on karthikeya
author img

By

Published : Aug 1, 2022, 8:40 PM IST

Anupama on karthikeya promotions: తాను హీరోయిన్‌గా నటించిన 'కార్తికేయ 2' సినిమా ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదో అనుపమ పరమేశ్వరన్‌ తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా తన పరిస్థితిని వివరించారు. "ప్రస్తుతం నేను రాత్రీపగలూ అనే తేడా లేకుండా రెండు సినిమాల చిత్రీకరణలో తలమునకలై ఉన్నా. ఇతర ఆర్టిస్టులతో నేను కలిసి నటించాల్సిన ఈ షెడ్యూల్‌ కొన్నాళ్ల క్రితమై ఖరారైంది. అలాగే 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో పలు మార్పులు జరిగాయి. దాంతో నేనిప్పుడు ఈ చిత్ర ప్రచారానికి రాలేకపోతున్నా. నా పరిస్థితిని మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అని అనుపమ పరమేశ్వరన్‌ పేర్కొన్నారు. ఎంతగానో కష్టపడి తెరకెక్కించిన 'కార్తికేయ 2' చిత్ర బృందంపై అనుపమ ప్రేమను కురిపించారు. హీరో నిఖిల్‌ను ప్రత్యేకంగా కొనియాడారు.

అనుపమ పరమేశ్వరన్‌- నిఖిల్​

నిఖిల్‌ హీరోగా రూపొందిన చిత్రమే 'కార్తికేయ 2'. ద్వారకా నగర రహస్యాన్ని ఛేదించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'కార్తికేయ'కు ఇది సీక్వెల్‌. ఈ పాన్‌ ఇండియా సినిమా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేసేందుకు చిత్ర బృందం విభిన్న రకాలుగా ప్రచారం చేస్తోంది. వీటిల్లో కథానాయకుడు నిఖిల్‌ మాత్రమే కనిపించడం వల్ల అనుపమ రావట్లేదేంటనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో ఉత్పన్నమయ్యాయి. నిఖిల్‌- అనుపమ కాంబోలో తెరకెక్కిన '18 పేజెస్‌' సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు, 'బటర్‌ఫ్లై' అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో అనుపమ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇవీ చదవండి: ప్లీజ్​ నా సినిమా బాయ్​కాట్​ చేయొద్దు: స్టార్​ హీరో ఆవేదన

నన్ను పెళ్లి చేసుకుంటే తట్టుకోలేరు.. రోజంతా అదే చేయాలి: బిగ్​బాస్​ బ్యూటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.