ETV Bharat / entertainment

'అంటే సుందరానికీ..' ట్రైలర్‌ అప్డేట్​.. మరో స్పెషల్ సాంగ్​లో 'జిగేల్​ రాణి'! - pooja hegde special song

'అంటే సుందరానికీ..' సినిమా ట్రైలర్​ అప్డేట్​ను ప్రకటించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్​ గ్లింప్స్​ ఆకట్టుకుంటోంది. అలాగే పూజా హెగ్డేకు మరో స్పెషల్​లో సాంగ్​లో నర్తించేందుకు అవకాశం వచ్చినట్లు సమాచారం.

Ante Sundaraniki Movie .. Pooja Hegde Special Song Updates
'అంటే సుందరానికీ..' ట్రైలర్‌ అప్డేట్​.. మరో స్పెషల్ సాంగ్​లో 'జిగేల్​ రాణి'!
author img

By

Published : May 30, 2022, 1:28 PM IST

Updated : May 30, 2022, 2:16 PM IST

నాని, నజ్రియా నజీమ్‌ కలిసి జంటగా నటించిన 'అంటే సుందరానికీ..' సినిమా ఈ జూన్​ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్​ను షురూ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా ట్రైలర్​ గ్లింప్స్​ను షేర్​ చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది. మూవీ ట్రైలర్‌ను జూన్‌ 2న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రంగస్థలం' సినిమాలో జిగేల్ రాణి పాటతో అలరించిన పూజా హెగ్డే.. తాజాగా ఎఫ్​3 సినిమాలోనూ మెరిసింది. పూజ ఐటమ్​ సాంగ్​లు సూపర్​ హిట్​ కావడమే కాకుండా సినిమాకు ప్లస్​ పాయింట్​ కావడం వల్ల.. స్పెషల్​ సాంగ్​ అవకాశాలు పూజాను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా బాలీవుడ్ మూవీ 'యానిమల్' నుంచి ఒక స్పెషల్ సాంగ్ ఆఫర్​ పూజకు వచ్చినట్లు సమాచారం. రణబీర్ కపూర్ - రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాను 'టి-సిరీస్' నిర్మిస్తుండగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: 'నేను అతడిని ప్రేమిస్తున్నా..' పెదవి విప్పిన అనుపమ

Last Updated : May 30, 2022, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.