Animal Teaser : బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మూవీమేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఇక విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించి.. నెట్టింటి హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో రణ్‌బీర్ లుక్‌తో పాటు అతని యాక్షన్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. అయితే ఈ టీజర్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే..
రష్మిక-రణబీర్ సంభాషణతో మొదలైన ఈ టీజర్.. సెకండ్ షాట్ నుంచి వైలెంట్ మోడ్‌లోకి వెళ్ళింది. ఇక అనిల్ కపూర్, రణ్‌బీర్ మధ్య తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను టీజర్లో చూపించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా రణ్‌బీర్‌ని మూడు వేరియేషన్స్‌లో చూపించారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్‌లో రణబీర్ 'అర్జున్ రెడ్డి'ని మించిపోయేలా కనిపించారు.
టీజర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపించకపోయినప్పటికీ.. దాని ఇంపాక్ట్ ఈ సినిమాలో ఏ రేంజ్లో ఉండనుందో ఇట్టే కనిపిస్తోంది. దాదాపు రెండు నిమిషాల 26 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. కొన్నిచోట్ల రణబీర్ కూల్‌గా కనిపిస్తే మరికొన్ని చోట్ల చాలా వైలెంట్‌గా కనిపించారు.
-
The Animal Malayalam Teaser is Here 🔥https://t.co/s0oXgVGn5P#AnimalTeaser #Animal#AnimalTheFilm #AnimalOn1stDec@AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar #BablooPrithiveeraj…
— T-Series (@TSeries) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Animal Malayalam Teaser is Here 🔥https://t.co/s0oXgVGn5P#AnimalTeaser #Animal#AnimalTheFilm #AnimalOn1stDec@AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar #BablooPrithiveeraj…
— T-Series (@TSeries) September 28, 2023The Animal Malayalam Teaser is Here 🔥https://t.co/s0oXgVGn5P#AnimalTeaser #Animal#AnimalTheFilm #AnimalOn1stDec@AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar #BablooPrithiveeraj…
— T-Series (@TSeries) September 28, 2023
"నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా ఆన్సర్ చెబుతాను. కానీ మా నాన్న గురించి మాత్రం అడక్కు" అని రష్మికతో హీరో చెప్పే డైలాగ్, "నా ఫాదర్ ఈ ప్రపంచంలో కల్లా బెస్ట్ ఫాదర్" అని అనడం, "నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకు ఎక్కడా కనబడలేదు. నాలో నేను చూసుకున్నాను. నా కన్నా చెడ్డవాడు లేడు. నాన్న ఇది ఇప్పుడే మొదలైంది. నేను వాడిని కనిపెట్టాలి. కలవాలి. చంపాలి. మీరు నిరాశ పడకండి నాన్న" అంటూ రణ్‌బీర్ చెప్పిన డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">