ETV Bharat / entertainment

'యానిమల్​' డైరెక్టర్​ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్న థియేటర్స్​ యజమానులు! - రణ్​బీర్​ కపూర్​ రష్మిక యానిమల్​ సినిమా

Animal Movie Runtime : హీరో రణ్​బీర్​ కపూర్​ నటించిన 'యానిమల్​' మూవీ రన్​ టైమ్​ తగ్గించే​ విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదు ఆ సినిమా డైరెక్టర్​ సందీప్ రెడ్డి వంగా. దీంతో ఆయన చేసిన పనికి థియేటర్​ ఓనర్స్​కు తిప్పలు తప్పేలా లేవు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Animal Movie Runtime
Animal Movie Duration
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 12:26 PM IST

Animal Movie Runtime : బాలీవుడ్​ నటుడు రణ్​బీర్ కపూర్​, హీరోయిన్​ ర‌ష్మిక జంటగా నటించిన తాజా చిత్రం 'యానిమల్​'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్​-ప్రొడక్షన్​ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ ర‌న్‌టైమ్‌​ అంశంపై బాలీవుడ్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అదే.. సినిమా రన్​టైమ్​ను కుదించే విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదట దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా. సుమారు 3 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ కథను తగ్గించాలని దర్శకుడికి ఎన్నో అభ్యర్థనలు వచ్చాయట. అయితే కుదరని పరిస్థితుల్లో తన స్క్రిప్ట్​లో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగానే స్క్రీన్​పై పదర్శించేందుకు ఆయన సిద్ధమయ్యారట. తాను అనుకున్న కథను ఏ మార్పులు లేకుండా ప్రేక్షకులకు చూపించాలంటే ర‌న్‌టైమ్ విష‌యంలో ఏమాత్రం రాజీపడే పసక్తే లేదని సందీప్ తేల్చి చెప్పినట్లు స‌మాచారం.

ఆ విషయంలో డైరెక్టర్​ నో కాంప్రమైజ్​..!
ముందుగా 'యానిమల్​'ను మూడున్నర గంటల నిడివితో రిలీజ్​ చేయాలని అనుకున్నారట మేకర్స్. ఈ క్రమంలో ఇంత ఎక్కువ నిడివ గల సినిమా అంటే థియేటర్స్​లో వేసే షోస్​ టైమింగ్​తో పాటు ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయని కొందరు సూచించారట. దీంతో 210 నిమిషాల ర‌న్​టైమ్​లో 15 నిమిషాలు కత్తిరించి చివరకు 3 గంటల 15 నిమిషాలకు సినిమాను కుదించారట డైరెక్టర్​. అయితే ఇంత పెద్ద కథను రెండు భాగాలుగా తీసి విడుదల చేద్దామని భావించినా.. అది మరీ సాగదీసినట్లు ఉంటుందని.. అందుకే ఆ ఆలోచనను పక్కకు పెట్టి అనుకున్న స్క్రిప్ట్​ ప్రకారమే వెళ్దామని డిసైడ్​ అయ్యారట.

రెండు ఇంటర్వెల్స్​..
అయితే ఈ మూడు గంటల రన్​టైమ్​ నిర్ణయంతో థియేటర్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత లాంగ్​ రన్​టైమ్​ సినిమాలను తమ టాకీస్​లలో ప్రదర్శిస్తే ఆ తర్వాతి షోల టెలికాస్ట్​ టైమింగ్​ పరంగా, అలాగే స్పెషల్​ షోస్​ వేసే విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటామని వాపోతున్నారు. ఇక 'యానిమల్​' షో-టైమ్​లో డబుల్​ ఇంటర్వెల్స్​ కూడా తప్పనిసరిగా మారే పరిస్థితి ఏర్పడింది.

మొత్తంగా ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ మూడు గంట‌ల పదిహేను నిమిషాల రన్​టైమ్​తో డిసెంబర్​ 1న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న రెండో హిందీ సినిమా 'యానిమల్​'. 'క‌బీర్‌సింగ్' స‌క్సెస్ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు లాంగ్​ గ్యాప్​ తీసుకుని ఈ ప్రాజెక్ట్​ను చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

టైట్​ ఫిట్​ డ్రెస్​లో ఏంజిల్​లా జాన్వీ పాప - అందాలు అదిరిపోయాయిగా!

'పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు చేయట్లేదు?'- హీరో నాని స్టన్నింగ్​ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.