Animal Movie Box Office Collection : టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ లీడ్‌లో తెరకెక్కిన 'యానిమల్' సినిమా బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్ హాలీడేస్ (వీక్ డేస్), వీకెండ్లోనూ హౌల్ఫుల్ షోస్‌తో ప్రదర్శితమౌతూ, కాసుల వర్షం కురిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియాలో రూ.400 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
హిందీలో ఆల్‌టైమ్ రెండో శనివారం రికార్డులను కూడా యూనిమల్ బద్దలుగొట్టింది. శనివారం ఈ మూవీ హిందీలో 32.47 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం తెలిపింది. ఇక దీంతో పాటు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన టాప్ 5 మూవీల్లో ఒకటిగా నిలిచినట్లు తెలుస్తోంది. ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ రమేశ్ బాల తెలిపిన సమాచారం ప్రకారం రూ.650 కోట్లకు పైగా గ్రాన్ కలెక్ట్ చేసిన జాబితాలో ప్రస్తుతం యానిమల్ ఐదో స్థానంలో ఉంది. ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మొదటి నాలుగు స్థానాల్లో షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్', 'జవాన్' తోపాటు రజనీ కాంత్ 'జైలర్', సన్నీ దెఓల్ 'గదర్-2' ఉన్నాయి.
-
2023 Indian Movies that grossed ₹ 650 Crs+ at the WW Box office..
— Ramesh Bala (@rameshlaus) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1. #Pathan
2. #Jawan
3. #Jailer
4. #Gadar2
5. #Animal *
* - Still Running
">2023 Indian Movies that grossed ₹ 650 Crs+ at the WW Box office..
— Ramesh Bala (@rameshlaus) December 10, 2023
1. #Pathan
2. #Jawan
3. #Jailer
4. #Gadar2
5. #Animal *
* - Still Running2023 Indian Movies that grossed ₹ 650 Crs+ at the WW Box office..
— Ramesh Bala (@rameshlaus) December 10, 2023
1. #Pathan
2. #Jawan
3. #Jailer
4. #Gadar2
5. #Animal *
* - Still Running
Animal Movie Cast : ఈ సినిమా విషయానికి వస్తే, తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన 'యానిమల్'లో ఈ సినిమాలో హీరో రణ్‌బీర్‌కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. తండ్రీ కుమారుల సెంటిమెంట్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. తండ్రి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించారు. చిన్న క్యామియో పాత్ర చేసిన కొత్త 'నేషనల్ క్రష్' తృప్తి డిమ్రికి అభిమానులు ఆకాశానికెత్తేశారు. ఆ సోషల్ మీడియాలో ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. 'యానిమల్' తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న విడుదలైంది. మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
వింటేజ్ లుక్‌లో దళపతి విజయ్- 10 నిమిషాల కోసం రూ.6 కోట్లు ఖర్చు!
అడవిలో నగ్నంగా బాలీవుడ్ హీరో - నన్ను నేను తెలుసుకోవడానికంటూ ట్వీట్!