ETV Bharat / entertainment

'యానిమల్'​ మూవీకి సెన్సార్ షాక్​ - ఆ ఇద్దరి సీన్స్​పై అభ్యంత్రం - 'A' సర్టిఫికేట్ ఇచ్చాక మార్పులు!​ - యానిమల్ మూవీ డైలాగ్స్

Animal Movie Censor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్,​ సందీప్​ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. పాన్​ ఇండియా లెవెల్​లో ఈ చిత్రం డిసెంబర్​ 1న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని సెన్సార్​ బోర్డు సూచించిందట. ఇంతకీ అవేంటంటే ?

Animal Movie Censor
Animal Movie Censor
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 5:44 PM IST

Updated : Nov 29, 2023, 6:49 PM IST

Animal Movie Censor : బాలీవుడ్​ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్​ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'యానిమల్'. ట్రైలర్, సాంగ్స్​తో మూవీ లవర్స్​లో భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం డిసెంబర్ 1 న పాన్ ఇండియా లెవెల్​లో వెండితెరపైకి రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​ కూడా గ్రాండ్​గా జరిగింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్​కు అన్ని రకాలుగా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డ్​ యానిమల్​కు 'A' సర్టిఫికేట్ ఇవ్వగా.. ఇప్పుడు ఈ సినిమాలో పలు మార్పులు చేయాలని సూచించిందట. దీంతో సెన్సార్​ బోర్డు సూచనలకు అనుగుణంగా ఆ మార్పులను మూవీ టీమ్ చేసినట్లు సమాచారం.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో 'బ్లాక్', 'కాస్ట్యూమ్' వంటి కొన్ని పదాలను మార్చారట. అయితే బ్లాక్​ ప్లేస్​లో ఏ పదాన్ని వాడాలో తెలపనప్పటికీ.. 'కాస్ట్యూమ్'​ ప్లేస్​లో మాత్రం 'వస్త్ర' అనే పదాన్ని ఉపయోగించాలని సెన్సార్​ బోర్డు పేర్కొందట. ఇంకా, "కభీ నహీ", "క్యా బోల్ రహే హో ఆప్" వంటి కొన్ని డైలాగ్‌లను కూడా మార్చారట. అంతే కాకుండా ఆ డైలాగుల ప్రకారం సినిమాలోని సబ్ టైటిల్స్ కూడా మార్చారట. "నాటక్" అనే పదాన్ని మ్యూట్ చేశారని సమాచారం. అంతే కాకుండా విజయ్, జోయా పాత్రలు మధ్య జరిగే ఇంటిమేట్ షాట్‌లను తొలగించారట. అయితే 'యానిమల్'​లో ఈ రోల్స్​ ప్రాముఖ్యత ఏంటో.. అసలు ఈ క్యారెక్టర్స్​లో ఎవరు నటిస్తున్నారో అన్న విషయాలను ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఈ మూవీ దాదాపు మూడు గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో రన్​ అవ్వనుందట.

యానిమల్​ కోసం బీస్టె లెవెల్​లో రణ్​బీర్ ట్రాన్స్​ఫార్మేషన్..
Animal Movie Ranbir Look : ఇక ఈ మూవీలో రణ్​బీర్ సరికొత్త లుక్​లో కనిపించారు. ట్రైలర్​లో మూడు రకాల లుక్స్​లో మెరిసి అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా లాంగ్​ హెయిర్​, బియర్డ్​ లుక్​లో కనిపించి యువతలోమంచి క్రేజ్​ సంపాదించుకున్నారు. దీంతో పాటు తన బాడీ బిల్డింగ్​ విషయంలోనూ మార్పులు చేశారు. అయితే ఈ లుక్‌ కోసం రణ్‌బీర్ పడిన కష్టాన్ని తాజాగా తన ట్రైనర్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎంతోమంది సెలబ్రిటీల వ్యక్తిగత జిమ్‌ ట్రైనర్​గా ఉన్న శివోహం.. ఈ సినిమా కోసం రణ్‌బీర్‌ ఎంతో కఠోర శ్రమ చేసినట్లు రాసుకొచ్చారు.

"మరోలక్ష్యం నెరవేరింది. మరో మైలురాయిని సాధించారు. పని పట్ల మీకున్న కృషి, అంకితభావం మాటల్లో చెప్పలేనివి. అలాగే మీ నటనతో ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. మీ ఫిట్‌నెస్‌ కోచ్‌గా ఉండటం నాకెంతో ఆనందానిస్తుంది" అంటూ చెప్పారు. దీంతో పాటు 'యానిమల్‌' టీమ్‌కు అభినందనలు తెలిపారు. అంతే కాకుండా రణ్‌బీర్ పాత ఫొటోను తాజా లుక్‌తో పోలుస్తూ షేర్‌ చేశారు.

'యానిమల్' రన్​టైమ్ 3.20 గంటలు! - బాలీవుడ్​లో ఇదే లాంగెస్ట్ మూవీ బాస్!

సందీప్ రెడ్డి ఒరిజినల్​ డైరెక్టర్​- ఆ సీక్వెన్స్​ ఐడియా వారిదే : రణ్​బీర్​ కపూర్

Last Updated : Nov 29, 2023, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.